"ఇద్దరూ డిజప్పాయింటే చేశారు"

సమ్మర్ సినిమాలు వరుసగా వచ్చేస్తున్నాయి. ఈ సీజన్ లో రిలీజ్ అయిన మొదటి భారీ చిత్రం రంగస్థలం ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో.. తర్వాత రాబోయే చిత్రాలపై అంచనాలతో పాటు.. బాధ్యత కూడా బాగా పెరిగిపోయింది. కంటెంట్ విషయంలో ఏ మాత్రం తగ్గినా.. బజ్ ఏ కొంచెం డౌన్ అయినా.. రిజల్ట్ ఎలా ఉంటుందనే విషయం.. ఇప్పటికే ఛల్ మోహన్ రంగ.. కృష్ణార్జున యుద్ధం చిత్రాల ఫలితాలతో తేలిపోయింది.

ఇక రాబోయే సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొంది.. భారీ సక్సెస్ లు సాధించే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్న సినిమాలు రెండు. ఒకటి మహేష్ నటించిన భరత్ అనే నేను.. రెండు అల్లు అర్జున్ మూవీ నా పేరు సూర్య. ఈ చిత్రాలకు ప్రమోషన్స్ లో ఇప్పుడు వేగం పెంచారు. రెండు సినిమాలకు వరుసగా లిరికల్ సాంగ్స్ కానీ.. లేకపోతే సాంగ్ ప్రోమోలు కానీ విడుదల చేస్తున్నారు.

భరత్ అనే నేను నుంచి హీరోయిన్ ఆండ్రియా పాడిన 'అరెరె.. ఇది కలలా ఉందే' అనే సాంగ్ మేకింగ్ తో కలిపి లిరికల్ సాంగ్ విడుదల చేశారు. మరోవైపు నా పేరు సూర్య నుంచి 'మన కథ బ్యూటిఫుల్' అంటూ సాగే పాట వచ్చింది. ఛార్ట్ బస్టర్స్ గా నిలుస్తాయనే అంచనాల మధ్య వచ్చిన ఈ రెండు పాటలు జస్ట్ ఓకే అనిపించుకుని సరిపెట్టేసుకున్నాయి.

మరి ఆడియో పరంగా ఓకే అనిపించుకున్న ఈ పాటలు.. సినిమాలో విజువల్ పరంగా ఎమోషన్స్ కూడా కలిసి చూస్తాం కాబట్టి.. మెప్పించే అవకాశాలు కొంతవరకు ఉన్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English