బాబుపై సీనియ‌ర్ ఐఏఎస్ ఆరోప‌ణ‌లు..

బాబుపై సీనియ‌ర్ ఐఏఎస్ ఆరోప‌ణ‌లు..

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడుకు క‌లల ప్రాజెక్టు అయిన న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో ఆయ‌నపై ప‌లువురు విమ‌ర్శ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.  కొద్దికాలం క్రితం ప్ర‌భుత్వ మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఐవైఆర్ కృష్ణారావు విమ‌ర్శ‌లు చేయ‌గా...ఆయ‌న‌కు సీనియ‌ర్ ఐఏఎస్, మాజీ సీఎస్‌ అజ‌య్ క‌ల్లం తోడ‌య్యారు. అచ్చూ ఐవైఆర్ లాంటి ఆరోప‌ణ‌లే చేసిన అజ‌య్‌క‌ల్లం లాజిక్ మిస్స‌య్యార‌ని పలువురు చ‌ర్చించుకుంటున్నారు.

తాజాగా విజ‌య‌వాడ‌లో మాజీ ఐఏఎస్ అజ‌య్ క‌ల్లం మీడియాతో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలోని ప‌రిణామాల‌పై తాను పుస్త‌కం రాసిన‌ట్లు వెల్ల‌డించారు. మహానగరాల నిర్మాణం అంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లుగా ఉందని ఆయన ఆరోపించారు. అనుభ‌వజ్ఞుల పాలన అంటే పెద్ద నగరాలు కట్టడమే కాదని, గ్రామాలను అభివృద్ధి చేయడం కూడా అని అజయ్ వ్యాఖ్యానించారు. రాజధాని పేరుతో దుబారా చేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో కొత్త రాజధాని కట్టాలనుకునేది కేవలం పైరవీల కోసమే మాత్రమేనని అన్నారు.

కొత్త రాష్ట్రంలో ప్రజలకు మంచి జరగకపోగా, పాలకుల అవినీతి చాలా పెరిగిపోయిందని, దీని వల్ల వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదముందని అజ‌య్ క‌ల్లం హెచ్చ‌రించారు. కాగా, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ప‌రోక్షంగా ప్ర‌స్తావిస్తూ మేక‌ప్ వేసుకొని వ‌చ్చే వారిప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్నారు.

కాగా, మాజీ సీఎస్ వ్యాఖ్య‌ల‌పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మవుతున్నాయి. ప‌ద‌విలో ఉండ‌గా ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌కుండా ప‌ద‌వీ విర‌మ‌ణ అనంత‌రం పుస్త‌కాల పేరుతో అవినీతి వంటి వ్యాఖ్య‌లు చేయ‌డం ఎంత‌వ‌ర‌కు స‌బ‌బ‌ని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. అవినీతి ప్ర‌మాదక‌ర స్థాయికి చేరింద‌నే వారు గతంలో ఏం చేశార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. పైగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై అజ‌య్ క‌ల్లం చేసిన వ్యాఖ్య‌లు ఆశ్చ‌ర్య‌కంగా ఉన్నాయంటున్నారు. ప‌వ‌న్ ఇప్ప‌టివ‌ర‌కు ప‌రిపాల‌నలోనే లేర‌ని, ఆయన పార్టీ త‌ర‌ఫున ప్ర‌జా ప్ర‌తినిధులు కూడా లేరని పేర్కొంటూ ఈ స‌మ‌యంలో విమ‌ర్శ‌ల్లో వాస్త‌విక‌త ఏముంటుంద‌ని అంటున్నారు. ఒక‌వేళ కేవ‌లం వైసీపీ గురించి మాట్లాడి ఉంటే ఆయ‌న స్థాయిని త‌గ్గించుకోవాల‌న్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English