తెలుగువాళ్లంద‌రికీ కొత్త పిలుపు ఇచ్చిన కేసీఆర్‌

తెలుగువాళ్లంద‌రికీ కొత్త పిలుపు ఇచ్చిన కేసీఆర్‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కొత్త పిలుపు ఇచ్చారు. దేశ రాజ‌కీయాల‌పై గురిపెట్టిన కేసీఆర్ ఈ క్ర‌మంలో జాతీయ రాజ‌కీయాల‌పై గురిపెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో జనతాదళ్(సెక్యులర్) అధినేత దేవెగౌడ ఆయన కుమారుడు కుమారస్వామితో బెంగళూరులో సీఎం కేసీఆర్ ఇవాళ సమావేశమయ్యారు. భేటీలో టీఆర్‌ఎస్ ఎంపీలు వినోద్‌కుమార్, సంతోష్‌కుమార్, నటుడు ప్రకాశ్ రాజ్ పాల్గొన్నారు. ఈ భేటీ అనంత‌రం ఆయ‌న మీడియాతో తెలంగాణ కోసం పోరాడుతున్నప్పుడు దేవెగౌడ ఉద్యమానికి మద్దతిచ్చారన్నారు. తెలంగాణ ఉద్యమానికి నైతిక మద్దతు ఇచ్చేందుకు నిర్వహించిన భారీ సభలో కూడా దేవెగౌడ స్వయంగా పాల్గొన్నరని తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని కేసీఆర్‌ ఆరోపించారు. జాతీయ రాజకీయాల్లో పెద్ద ఎజెండాతో ముందుకు పోతున్నట్లు.. తమది తృతీయ ఫ్రంట్ కాదని తమది ప్రజల ఫ్రంట్ అని  అన్నారు.  దేశం, రైతులను కాపాడటమే తమ అంతిమ లక్ష్యమని కేసీఆర్ వెల్ల‌డించారు.

స్వాతంత్య్రం అనంతరం ఆరేళ్లు మినహా కాంగ్రెస్, బీజేపీలే దేశాన్ని పాలించాయని అయితే, వారి లోపభూయిష్టమైన విధానాలే వల్లే దేశం సమస్యలను ఎదుర్కొంటుందని కేసీఆర్ అన్నారు. `రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ర్టాల మధ్య నీటి సమస్యను ఇప్పటి వరకు పరిష్కరించలేకపోతున్నారు. కావేరీ జలాల సమస్యకు ఇంత వరకు పరిష్కారం దొరకలేదు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యూనల్ ఇప్పటి వరకు నీటి సమస్యకు పరిష్కారం చూపలేదు. ఎందుకీ ప‌రిస్థితి?` అని కేసీఆర్ ప్ర‌శ్నించారు. త‌మ ఫ్రంట్‌లోకి ఏ పార్టీ కలిసి వచ్చిన కలుపుకుపోతామ‌ని సీఎం కేసీఆర్ వెల్ల‌డించారు. అంతా ఏకతాటిపై నిలిచి దేశాన్ని రైతులను కాపాడదామని పిలుపునిచ్చారు. కర్ణాటకలో ఉన్న తెలుగు ప్రజలంతా జేడీఎస్‌కు మద్దతు పలకాలని కేసీఆర్ ఈ సంద‌ర్భంగా కోరారు.

జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్‌తో భేటీ అనంతరం దేవెగౌడ మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలబడటం సంతోషకరమని అన్నారు. కేసీఆర్ సారథ్యంలో గ్రామీణాభివృద్ధి, బలహీన వర్గాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పాటుబడుతున్నదని కొనియాడారు. గర్భిణీల కోసం తెలంగాణ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి తెలంగాణ మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. `దేశంలో పరిష్కారం కానీ సమస్యలు ఎన్నో ఉన్నయి. సీఎం కేసీఆర్‌తో దేశ రాజకీయాలపై చర్చించడం సంతోషంగా ఉందన్నారు. దేశంలో రైతులు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. దేశంలో రైతుల ఆత్మహత్యలు పెరిగినయి. రైతుల ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. ఇందుకు ప‌రిష్కారం చూపాలి` అని దేవేగౌడ అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English