ఆ యాంకర్ ను దించాలని చూస్తున్నారబ్బా

ఆ యాంకర్ ను దించాలని చూస్తున్నారబ్బా

ఒకరు ఎవరైనా ఓ తరహాగా పేరు తెచ్చుకుంటే చాలు.. అదే మూస పట్టుకుని పైకి ఎక్కేయాలని.. దాన్నే ఇమిటేట్ చేసేసి అంతకు మించి పేరు పట్టేయాలని ప్రయత్నించడం కనిపిస్తుంది. ఒక మూవీ హిట్ అయితే అదే జోనర్ లో వరుసగా సినిమాలు రావడం లాంటిదన్న మాట. మీడియాలో కూడా ఇలాంటి కాపీ క్యాట్ తరహా బిహేవియర్ ఎక్కువగానే ఉంటుంది. అర్ణబ్ గోస్వామి గురించి తెలియని ఇండియన్ బహుశా ఉండడమో.

 ఇండియా వాంట్స్ టు నో.. అంటూ తన అరుపులతోనే ఛానల్ ను నడిపేసిన ఈయన.. ఇప్పుడు రిపబ్లిక్ టీవీలో బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అర డజన్ నుంచి 10 మంది వరకూ లైవ్ లో కూర్చోబెట్టి డిస్కషన్స్ చేసినా.. లైవ్ డిబేట్ మొత్తంలో ఆ పది మంది కలిపిన మాటల కంటే ఎక్కువగా అర్ణబ్ అరుపులే వినిపిస్తాయి. ఇప్పుడు ఇదే తరహా కేకలు.. పెడబొబ్బలను పెట్టేయడం తెలుగు మీడియాలో కూడా కనిపిస్తోంది. ఈ మధ్యనే ఒకాయనకు కాస్త పెద్ద పోస్ట్ లభించింది. చేతికి ఓ మాంచి మసాలా ఐటెం కూడా దొరికింది. ఇంకేం.. ఏమాత్రం తగ్గకుండా లైవ్ లోకి వచ్చినవాళ్ల పైనా.. ఫోన్ లో మాట్లాడుతున్న వారి పైనా డామినేషన్ చూపించేస్తూ దడ పుట్టించేస్తున్నాడు.

వాస్తవానికి ఓ వ్యక్తిని నిలదీసే అధికారం ఎవరికైనా ఉంటుంది. మీడియాకు బాధ్యత ఉంటుంది. తప్పు చేసినా సరే వారిని దండించే అధికారం  ఒక్క పోలీసులకు మాత్రమే ఉండగా.. కోర్టుకు శిక్షించే అధికారం ఉంటుంది. కానీ ఇలా వ్యక్తులపై రంకెలు వేసి బెదిరించేసే అవకాశం ఎవరు ఇచ్చారు.. ఎందుకు తీసుకుంటున్నారో అర్ధం కాని విషయం. తామేదో మోనార్క్ అన్న తరహాగా ప్రవర్తిస్తున్నారు.  అచ్చు అర్ణబ్ ను దింపేస్తున్నట్లుగానే ఉంది వాలకం. కొన్నాళ్లకు ఈ యాంకర్ల అరుపుల అరాచకం ఏ రేంజ్ కు చేరుతుందో?


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English