భార‌త్ కు `హ‌లో`చెప్పిన ఆర్కుట్ ఫౌండ‌ర్!

భార‌త్ కు `హ‌లో`చెప్పిన ఆర్కుట్ ఫౌండ‌ర్!

ఫేస్ బుక్ లో డేటా భద్ర‌త‌పై ప్ర‌పంచ‌వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. కొంత‌మంది ఫేస్ బుక్ ఖాతాదారుల డేటా చౌర్యానికి గురైంద‌ని సాక్ష్యాత్తూ ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్ అంగీక‌రించాడు. త‌మ యూజ‌ర్ల భ‌ద్ర‌త‌కు మ‌రిన్ని క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని హామీ ఇచ్చాడు. అయితే, ఇప్ప‌టికే సెల‌బ్రిటీల‌తో స‌హా చాలామంది త‌మ ఫేస్ బుక్ ఖాతాల‌ను డిలీట్ చేసే ప‌నిలో ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో ఫేస్ బుక్ కు దీటుగా స‌రికొత్త‌గా మ‌రో సోష‌ల్ మీడియా యాప్ వ‌చ్చింది.

`హ‌లో` పేరుతో స‌రికొత్త సోష‌ల్ మీడియా ప్లాట్ ఫాం అందుబాటులోకి వ‌చ్చింది. గూగుల్‌ మాజీ ఉద్యోగి, ఆర్కుట్‌ వ్యవస్థాపకుడు బయూకాక్ టెన్‌....‘హలో’ను రూపొందించాడు. బుధ‌వారం నాడు `హ‌లో`ను భార‌త్ లో ప్ర‌వేశ‌పెట్టారు. నేటిత‌రం అభిరుచుల‌కు అణుగుణంగా ‘హలో’ను బ‌యూకాక్ టెన్ తీర్చిదిద్దాడు.

ఇప్పుడంటే ఫేస్ బుక్, ట్విట్ట‌ర్, యూట్యూబ్, వాట్సాప్....ఇలా ర‌క‌ర‌కాల సోష‌ల్ మీడియా ప్లాట్ ఫామ్ లు అర‌చేతిలో అందుబాటులో ఉన్నాయి. అయితే, 2004లో గూగుల్‌ నుంచి వచ్చిన ఆర్కుట్ ....ప‌ది సంవ‌త్స‌రాల‌పాటు టాప్ సోష‌ల్ మీడియా ప్లాట్ ఫామ్ గా వెలిగింది. కాల‌గ‌మ‌నంలో దూసుకువ‌చ్చిన స‌రికొత్త యాప్ ల‌తో ఆర్క‌ట్ త‌న శోభ‌ను కోల్పోయింది. దీంతో, 2014లో ఆర్కుట్‌ సేవలను నిలిపివేశారు. అయితే, ఫేస్ బుక్ లో డేటా భద్ర‌త వ్య‌వ‌హారం నేప‌థ్యంలో ఆర్కుట్ వ్య‌వ‌స్థాప‌కుడు బ‌యూకాక్ టెన్ `హ‌లో`ను ప్ర‌వేశ‌పెట్టాడు. వాస్త‌వానికి భారత్ లో ఆర్కుట్ బీటీ వెర్ష‌న్ ను కొన్ని నెలలుగా ప‌రీక్షిస్తున్నారు. భార‌త్ లో దీనికి పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చింది.

ఇప్ప‌టికే బ్రెజిల్ లో ఇది పాపుల‌ర్ అయింది. అక్క‌డ ‘హలో’ మిలియన్‌ డౌన్ లోడ్‌లను పూర్తి చేసుకుంది. అభిరుచుల‌కు అనుగుణంగా....సానుకూల, అర్థవంతమైన, విశ్వసనీయ, దృఢమైన సోష‌ల్ మీడియా ప్లాట్ ఫామ్ గా యూజ‌ర్ల‌ను దగ్గర చేసేలా `హ‌లో`ను డిజైన్ చేశామ‌ని బయూకాక్ టెన్‌ అన్నారు. ప్రస్తుతం యాపిల్‌ యాప్‌ స్టోర్‌, గూగుల్‌ ప్లే స్టోర్‌లలో హ‌లో యాప్‌ అందుబాటులో ఉంది.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English