లైవ్‌లో తల్లిని చూసి బోరున ఏడ్చిన శ్రీరెడ్డి

లైవ్‌లో తల్లిని చూసి బోరున ఏడ్చిన శ్రీరెడ్డి

టాలీవుడ్ ప్రముఖులపై సంచలన ఆరోపణలతో వెలుగులోకి వచ్చిన శ్రీరెడ్డి నిన్న రాత్రి ఒక టీవీ ఛానెల్ చర్చలో భాగంగా బోరున ఏడ్చేసింది. ఆమె కొన్ని నిమిషాల పాటు తీవ్ర భావోద్వేగానికి గురై ఏడుస్తూనే ఉంది. అందుకు కారణం ఆ టీవీ ఛానెల్ ఆమె లైవ్‌లో ఉండగానే తన తల్లిని కలిసి ఇంటర్వ్యూ చేయడమే. శ్రీరెడ్డి ఇటీవలే ‘మా’ కార్యాలయం దగ్గర అర్ధనగ్నంగా నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

దీని గురించి తన తల్లిని ఛానెల్ ప్రతినిధి ప్రశ్నించి ఇబ్బంది పెట్టడం.. మళ్లీ మళ్లీ అదే ప్రశ్నను రిపీట్ చేయడం.. తన తల్లి ఏం మాట్లాడాలో పాలుపోని స్థితికి చేరడంతో శ్రీరెడ్డి ఉద్వేగానికి గురైంది. బోరున ఏడ్చేసింది. ఎందుకండీ మళ్లీ మళ్లీ ఆ ప్రశ్న అడుగుతారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక శ్రీరెడ్డి తల్లి మాట్లాడుతూ.. తన కూతురు చిన్నప్పట్నుంచి రెబల్ అని.. తాను ఏమనుకుంటే అదే చేస్తుందని.. ఆమెతో చాలా ఏళ్లుగా తమకు సంబంధాలు లేవని చెప్పింది.

శ్రీరెడ్డి పదేళ్ల కిందటే ఇల్లు వదిలి వెళ్లిపోయిందని.. తన బతుకు తాను బతుకుతోందని.. ఆమె ఏం చెప్పినా వినేది కాదని అంది. సాక్షి టీవీలో పని చేస్తున్నపుడు అంతా బాగానే ఉందని.. కానీ ఆ తర్వాత వద్దన్నా వినకుండా సినిమాల్లోకి వెళ్లిందని.. కొన్ని రోజులుగా ఆమె మీడియాలో కనిపిస్తుండటం.. అర్ధనగ్నంగా నిరసన వ్యక్తం చేయడం తమకు చాలా బాధ కలిగించిందని.. ఆమె పోరాటం మంచిదే అని.. కానీ అందుకు ఎంచుకున్న మార్గం సరైంది కాదేమో అన్నది తమ అభిప్రాయమని.. ఐతే దీని గురించి అడిగితే.. ‘నీకు తెలియదు ఊరుకోమ్మా నా వల్ల పది మంది.. వందమంది బతుకుతారు’ అని సమాధానం ఇచ్చిందని శ్రీరెడ్డి తల్లి వెల్లడించింది. శ్రీరెడ్డి విషయంలో తాము ఏమీ చెప్పే పరిస్థితుల్లో లేమని.. తాను తన భర్త ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తుంటామని.. ఎప్పుడూ పూజలు పునస్కారాల్లో మునిగిపోయి ఉంటామని ఆమె చెప్పింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English