తమిళ తంబీల‌పై త‌లైవా గుస్సా!

తమిళ తంబీల‌పై త‌లైవా గుస్సా!

క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు ల మ‌ధ్య కావేరీ జ‌లాల వివాదంపై తీవ్ర‌స్థాయిలో ఆందోళ‌న‌లు జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. కేంద్రం వెంట‌నే కావేరీ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేయాల‌ని త‌మిళనాట నిర‌స‌న‌లు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్ ల‌ను అడ్డుకుంట‌మాని ప‌లు రాజ‌కీయా పార్టీలు, ప్ర‌జా సంఘాలు వార్నింగ్ ఇచ్చాయి. త‌మ మాట కాద‌ని మ్యాచ్ ను నిర్వ‌హిస్తే  స్టేడియంలోకి పాములను వదులుతామని పీఎంకే నేత వేల్‌మురుగన్ చేసిన ప్ర‌క‌ట‌న వివాదాస్ప‌దమైంది. ఈ నేప‌థ్యంలో దాదాపు 4 వేల మంది పోలీసుల ప‌హారా న‌డుమ నిన్న చెన్నై, కోల్ క‌తాల మ‌ధ్య ఐపీఎల్ మ్యాచ్ జ‌రిగింది. అయితే, మ్యాచ్ సంద‌ర్భంగా స్టేడియం బ‌య‌ట తమిళ సంఘాలు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశాయి. ఓ ద‌శ‌లో పోలీసుల‌పై కూడా దాడికి దిగారు. విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న పోలీసుల‌పై ఆందోళ‌న‌కారులు దాడుల‌కు దిగ‌డాన్ని త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఖండించారు.

ఆందోళ‌న‌కారుల నిర‌స‌న‌ల మధ్య చెన్నై, కోల్ క‌తాల మధ్య మ్యాచ్ జ‌రిగింది. అయితే, మ్యాచ్ జ‌రుగుతున్న‌పుడు నిర‌స‌న కారులు.....చెన్నై ఆట‌గాడు రవీంద్ర జ‌డేజాపైకి బూట్లను విసిరారు. మ‌రి కొంద‌రు వ్య‌క్తులు చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీలను దగ్ధం చేశారు. దీంతో, ఆందోళనకారులను  అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు య‌త్నించారు. అయితే, పోలీసుల‌పై కూడా ఆందోళ‌న‌కారులు దాడికి దిగారు. దీంతో, ఈ ఘ‌ట‌న‌పై రజనీకాంత్ స్పందించారు. విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న పోలీసులపై దాడులకు దిగడం దారుణమని త‌లైవా మండిప‌డ్డారు. నిర‌స‌న తెలిపేందుకు వేరే మార్గాలున్నాయ‌ని, ఈ త‌ర‌హా హింసకు అడ్డుకట్ట వేయాల్సి ఉందని అభిప్రాయ‌పడ్డారు. ఇటువంటి ఘ‌ట‌న‌లను ఆప‌కుంటే దేశ రక్షణకు ముప్పు వాటిల్లే అవ‌కాశ‌ముంద‌ని చెప్పారు. డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడి చేసే వారికి క‌ఠిన శిక్ష‌లు విధించేందుకు చట్టాలను మరింత కఠినతరం చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు