ఎన్నిక‌ల షాక్‌..మోడీకి ఆ మాజీ సీఎం గుడ్ బై

ఎన్నిక‌ల షాక్‌..మోడీకి ఆ మాజీ సీఎం గుడ్ బై

దేశ రాజ‌కీయాల్లో ప్ర‌త్యేక ఆస‌క్తిని రేకెత్తిస్తున్న క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకోనుంది. అధికార కాంగ్రెస్‌, ప్ర‌తిప‌క్ష బీజేపీ ఈ ఎన్నిక‌ల‌ను సెమీ ఫైన‌ల్స్‌గా భావిస్తున్న సంగ‌తి తెలిసిందే. కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరనున్నారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ప‌రిణామం బీజేపీకి షాక్ ఇచ్చేదేన‌ని అంటున్నారు. అదే స‌మ‌యంలో ఇప్ప‌టికే ఊపులో ఉన్న కాంగ్రెస్ ఈ వార్త‌తో ఖుష్ అవుతోంది.

ఎస్ఎం కృష్ణ ఆరు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. 1962లో ప్రజాసోషలిస్టు పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన 1970లో కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక పదవులు పొందారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, గవర్నర్‌గా పనిచేశారు. గత ఏడాది ఆశ్చర్యకరంగా ఆ పార్టీని వదిలి బీజేపీలో చేరిన ఆయన దేశంలో కాంగ్రెస్ బతికి బట్టకట్టే పరిస్థితి లేదని అప్పట్లో వాఖ్యానించారు. ఇప్పుడాయన మళ్లీ తమ పార్టీలోకి వస్తారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. కర్ణాటక బీజేపీలో తగిన ప్రాధాన్యం లభించకపోవడం, యడ్యూరప్పను సీఎం అభ్యర్థిగా బీజేపీ ముందుగానే ప్రకటించడం, తన కుమార్తె శాంభవికి టిక్కెట్ ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించడం కృష్ణ ఆ పార్టీని వీడేందుకు కారణం కావచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన ఎస్ఎం కృష్ణ రావడం కాంగ్రెస్‌కు కలిసొచ్చే అంశం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. సీఎం సిద్దరామయ్య కూడా అంగీకరిస్తే ఎన్నికలకు ముందుగానే ఎస్ఎం కృష్ణ కాంగ్రెస్‌లో చేరుతారని కాంగ్రెస్ నాయకుడు ఒకరు చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English