ప్రియుడి కోసం మొగుడు హ‌త్య‌కు సుపారీ

ప్రియుడి కోసం మొగుడు హ‌త్య‌కు సుపారీ

ప‌రాయి వ్య‌క్తి కోసం క‌ట్టుకున్న మొగుడ్ని చంపేస్తున్న వైనాలు అంత‌కంత‌కూ ఎక్కువ అవుతున్నాయి. ప్రియుడి కోసం భ‌ర్త‌ను బ‌లిపెట్టే మ‌హిళ‌ల వైనం ఇటీవ‌ల కాలంలో సంచ‌ల‌నాలుగా మారుతున్నాయి. తాజాగా అలాంటిదే మ‌రో ఉదంతం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

కొద్ది రోజుల క్రితం రైలు ఢీ కొని వ్య‌క్తి మ‌ర‌ణించిన‌ట్లుగా భావించిన కేసు విచార‌ణ‌.. నాట‌కీయ మ‌లుపులు తిరిగింది. ప్రియుడి మోజులో ప‌డి భ‌ర్త‌ను భార్యే చంపించింద‌న్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇందుకోసం కిరాయి మూక‌కురూ.2ల‌క్ష‌ల మొత్తాన్ని సుపారీ ఇవ్వ‌టం షాకింగ్ గా మారింది. హైద‌రాబాద్ లోని స‌న‌త్ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకున్న ఈ దారుణాన్ని పోలీసులు బ‌య‌ట‌పెట్టారు.

బోరుబండ‌కు చెందిన 43 ఏళ్ల డ్రైవ‌ర్ ఖాజ ఫిబ్ర‌వ‌రి 21న బోరుబండ‌-హైటెక్ సిటీ రైల్వేస్టేష‌న్ మ‌ధ్య చ‌నిపోయి క‌నిపించాడు. మృత‌దేహం పై నుంచి రైలు వెళ్ల‌టంతో.. రైలు ప్ర‌మాదంగా భావించి కేసు న‌మోదు చేశారు. ప‌లు రైళ్లు ఇత‌డి మీదుగా వెళ్ల‌టంతో శ‌రీరం ముక్క‌లు ముక్క‌లైంది. నాంప‌ల్లి రైల్వే పోలీసులు కేసు న‌మోదు చేసుకొని విచార‌ణ చేప‌ట్టారు. అయితే.. ఈ ప్ర‌మాదం జ‌రిగిన ప్రాంతానికి ద‌గ్గ‌ర్లోని బండ‌రాళ్ల‌పై ర‌క్త‌పు మ‌ర‌క‌లు ఉండ‌టం.. మృత‌దేహం త‌ల‌పై బండ‌రాళ్లు మోదిన‌ట్లు క‌నిపించ‌టంతోకేసును స‌న‌త్ న‌గ‌ర్ పోలీసుల‌కు బ‌దిలీ చేశారు.

ల‌భించిన ఆధారాల‌తో హ‌త్య కేసుగా న‌మోదు చేశారు. మృతుడ్ని ఖాజాగా గుర్తించి అత‌డి భార్య స‌లేహాబేగంకు స‌మాచారాన్ని అందించారు. అయితే.. ఆమె తీరు అనుమానాస్ప‌దంగా ఉండ‌టంతో మ‌రింత లోతుగా విచార‌ణ చేప‌ట్టారు. దీంతో.. అస‌లు విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. స‌లేహాబేగం ఇంటికి ద‌గ్గ‌ర్లోని మాంసం దుకాణం నిర్వ‌హించే మ‌హ్మ‌ద్ త‌బ్రేజ్ ఖురేషీతో ఏర్ప‌డిన ప‌రిచ‌యం అక్ర‌మ సంబంధానికి దారి తీసింది. ఈ విష‌యాన్ని గుర్తించిన భ‌ర్త‌.. భార్య‌ను ప‌లుమార్లు మంద‌లించాడు. దీంతో భ‌ర్త‌ను హ‌త్య చేసేందుకు ప్రియుడితో ప్లాన్ చేసింది. రూ.2ల‌క్ష‌లు సుపారీగా ఇచ్చి భ‌ర్త‌ను చంపేందుకు ప్లాన్ చేయించింది.

ఒప్పందంలో భాగంగా బోర‌బండ‌కు చెందిన డ్రైవ‌ర్ ముజీబ్ అత‌నికి తెలిసిన వారంతా క‌లిసి ఖాజాను మ‌ద్యం తాగేందుకు పిలిచి అత‌డ్ని హ‌త్య చేశారు. అనంత‌రం రైలుప‌ట్టాల మీద ప‌డేసి వెళ్లిపోయారు. భార్య తీరుపై సందేహం వ‌చ్చి ఆమెను అదుపులోకి తీసుకోవ‌టం.. ఆమె ప్రియుడ్ని పోలీసులు విచారించ‌టంతో విష‌యం మొత్తం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English