కేంద్ర నుండి నిధులు బాగానే వస్తున్నాయి - వైసీపీ

కేంద్ర నుండి నిధులు బాగానే వస్తున్నాయి -  వైసీపీ

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఏపీలో విప‌క్ష పార్టీగా ఉన్న వైసీపీ అంట‌కాగుతోంద‌ని, ఇందుకు నిద‌ర్శ‌నంగా నాలుగేళ్లుగా మిత్ర‌పక్షంగా కొన‌సాగుతున్న టీడీపీ ఎన్డీఏ కూట‌మి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేలా బీజేపీ వ్య‌వ‌హ‌రించింద‌ని పెద్ద ఎత్తున క‌థ‌నాలు బ‌య‌ట‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.  బీజేపీతో లాలూచీ కార‌ణంగానే పార్ల‌మెంటులో వైసీపీ ఎంపీలు పెద్ద‌గా నిర‌స‌న తెల‌ప‌డం లేద‌ని, ఏదో మొక్కుబ‌డిగా అవిశ్వాస తీర్మానం ఇచ్చేసి ప‌ని అయిపోయింద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించార‌ని కూడా ఆరోప‌ణ‌లు వినిపించాయి.

ఓ వైపు అవిశ్వాస తీర్మానం అంటూనే వైసీపీకి చెందిన కీల‌క నేత‌, ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి.. ఏకంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పాదాల‌ను తాకే యత్నం చేసిన వైనాన్ని బ‌య‌ట‌పెట్టిన టీడీపీ ఎంపీ సీఎం ర‌మేశ్... బీజేపీ, వైసీపీ మ‌ధ్య ఉన్న లాలూచీని బయ‌ట‌పెట్టే య‌త్నం చేశారు. అస‌లు సీఎం ర‌మేశ్ స‌వాల్ కు సాయిరెడ్ది నుంచి స్పంద‌న కూడా రాలేదంటేనే ప‌రిస్థితి ఎలా ఉందో ఊహించుకోవ‌చ్చు. మొత్తంగా ఇప్పుడు ఎన్డీఏ నుంచి టీడీపీ బ‌య‌ట‌కు రాగా... ఆ స్థానాన్ని భ‌ర్తీ చేసేందుకు వైసీపీ ఉవ్విళ్లూరుతోంద‌న్న కోణంలో పెద్ద ఎత్తున క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.

ఈ క‌థ‌నాల‌న్నీ నిజ‌మేన‌న్న‌ట్లుగా వైసీపీ కీల‌క నేత‌, ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేగానే కాకుండా ప్ర‌జా పద్దుల క‌మిటీ చైర్మ‌న్‌గా ఉన్న బుగ్గ‌న రాజేంద్ర నాథ్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ సీఎం హోదాలో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు స్థాయికి మించి అప్పులు చేస్తూ... రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేస్తున్నార‌ని ఆరోపించారు. అదే స‌మ‌యంలో బీజేపీతో త‌మ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ర‌హ‌స్యంగా కుదుర్చుకున్న ఒప్పందాన్ని కూడా బుగ్గ‌న బ‌య‌ట‌పెట్టార‌న్న వాద‌న వినిపిస్తోంది. అస‌లు తెచ్చిన అప్పుల నిధులు ఎక్క‌డ ఖ‌ర్చు చేస్తున్నార‌ని ప్ర‌శ్నించిన బుగ్గ‌న‌... రాష్ట్రానికి కేంద్రం నుంచి వ‌స్తున్న నిధుల గురించి కూడా మాట్లాడారు.

*ఇంతింత అప్పులు అంటే మీరు ఏం చేస్తున్నట్లు ..డబ్బులు ఎక్కడ పోతున్నాయి. అలా అని కేంద్ర నిధులు రావటం  లేదా అంటే బాగానే వస్తున్నాయి. 2014-15లో రూ.21,779 వేల కోట్లు. 2015-16  కేంద్రం నుంచి రూ.21, 927 కోట్ల నిధులు. 2017-18 రూ.23 346 వేల కోట్లు నిధులు వచ్చాయి. గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటికంటే ఎక్కువగానే సెంట్రల్ గ్రాంట్స్ వచ్చాయి. అప్పు ఇచ్చేవాడు దొరికితే చాలు అన్నట్లు బ్రహ్మాండంగా అప్పులు చేస్తున్నారు*  అని బుగ్గ‌న త‌న‌దైన శైలిలో చెప్పుకుంటూ పోయారు.

రాష్ట్రానికి నిధులు రావ‌డ‌మ లేదు అని స‌ర్కారీ గ‌ణాంకాలే చెబుతుంటే... బాగానే వ‌చ్చాయి క‌దా... ఇదిగో లెక్క‌లంటూ బుగ్గ‌న చెబుతున్నారంటే... వైసీపీ, బీజేపీ మ‌ధ్య  ఉన్న మైత్రి బ‌య‌ట‌ప‌డిన‌ట్టే క‌దా అన్న వాద‌న వినిపిస్తోంది. అయినా అసెంబ్లీకి కూడా రాకుండానే ఈ లెక్క‌ల‌న్నీ బుగ్గ‌న‌ ఎలా సేక‌రించార‌న్న విష‌యం కూడా ప్ర‌స్తావ‌నార్హ‌మే. బీజేపీ అధిష్ఠానం త‌న పార్టీకి చెందిన ఏపీ నేత‌ల‌కు ఇస్తున్న‌ట్లుగానే... ఈ లెక్క‌ల‌ను వైసీపీకి కూడా గుట్టు చ‌ప్పుడు కాకుండా అంద‌జేస్తున్న‌ట్లే క‌దా అన్న‌ది ఇప్పుడు అంద‌రి నోటా విపిపిస్తున్న వాద‌న‌. మొత్తంగా బాబుపై పోరాటం చేయ‌బోయిన బుగ్గ‌న‌... త‌న పార్టీ నిజ నైజాన్ని, బీజేపీతో త‌న పార్టీకి ఉన్న లాలూచీని బ‌య‌ట‌పెట్టార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English