సంచ‌ల‌నం: ఎమ్మెల్యేను లారీతో గుద్దించ‌బోయారు !

సంచ‌ల‌నం: ఎమ్మెల్యేను లారీతో గుద్దించ‌బోయారు !

బీజేపీ ఫైర్‌బ్రాండ్ నాయ‌కుడు,  పాత‌బ‌స్తీలోని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌ను లేపేసేందుకు ప్ర‌య‌త్నం చేశార‌ని రాజాసింగ్ ఆరోపించారు. ఇందుకు ప‌క్కా స్కెచ్ వేశార‌ని అయితే తృటిలో ప్ర‌మాదం త‌ప్పింద‌ని పేర్కొన్నారు. మీడియా క‌థ‌నాల ప్ర‌కారం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ వద్ద ఎమ్మెల్యేకు తృటిలో ప్రమాదం తప్పింది.

ఔరంగాబాద్‌లో పార్టీ మీటింగ్‌కు హాజరై తిరిగి వస్తున్న క్రమంలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు వైపు ఓ లారీ దూసుకువచ్చింది. అప్రమత్తతతో కారును డ్రైవర్ రోడ్డు కిందకు దించాడు. దీంతో వెనుక వస్తున్న మరో కారును లారీ ఢీకొట్టింది. లారీ డ్రైవర్ పరారీ అయ్యాడు.

కాగా, ఈ ఘ‌ట‌న‌పై రాజాసింగ్ మాట్లాడుతూ నన్ను మర్డర్ చేసేందుకు కుట్ర జ‌రిగింద‌ని ఆరోపించారు. ఔరంగాబాద్‌లో పార్టీ సమావేశం ముగించుకుని సోమవారం తెల్లవారుజామున తిరిగి వస్తుండగా.. తన కారుతో పాటు అనుచరుల కారును ఓ లారీ ఫాలో అయిందని తెలిపారు. తన కారును ఢీకొట్టే సమయంలో హైవే మీది నుంచి సర్వీస్ రోడ్డుకు పోనివ్వాలని డ్రైవర్‌కు సూచించానని రాజాసింగ్ చెప్పారు. తన కారు రోడ్డు కిందకు దిగడంతో.. వెనుక ఉన్న కారును లారీ ఢీకొట్టి వెళ్లిపోయిందన్నారు.

తన అనుచరులు లారీ డ్రైవర్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించగా అతడు పారిపోయాడు. లారీ క్లీనర్‌ను అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించామని తెలిపారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు ఎమ్మెల్యే. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు