ప‌వ‌న్ దృష్టే పెట్ట‌లేదు...ఎందుకింత ఆతృత కామ్రేడ్‌

ప‌వ‌న్ దృష్టే పెట్ట‌లేదు...ఎందుకింత ఆతృత కామ్రేడ్‌

ఇటీవ‌లి కాలంలో ఏపీ, తెలంగాణ‌ల్లో ఉద్య‌మాల ప‌రంగా క్రియాశీలంగా మారుతున్న లెఫ్ట్ పార్టీల తీరుతో వామ‌పక్ష పార్టీల అభిమానులు ఒకింత ఖుష్ అవుతున్నారు. ఏపీలో ప్ర‌త్యేక హోదా కోసం, తెలంగాణ‌లో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై స్పందించ‌డం ద్వారా మ‌ళ్లీ వామ‌ప‌క్షాలు పుంజుకుంటున్నాయ‌నే అభిప్రాయం క‌లుగుతోంది. అయితే ఇలా వామప‌క్షాలు త‌మంత తాముగా బ‌ల‌పడుతున్న భావ‌న మొద‌లైన స‌మ‌యంలోనే...ఆ పార్టీలు స్వంతంగా ఎదిగేందుకు కృషి చేయ‌కుండా ఇంకా పొత్తుల జ‌పం చేస్తూ తోక పార్టీలుగా మిగిలేందుకు ఆస‌క్తి చూపుతున్నారంటున్నారు. తాజాగా  పార్టీల ఆశాకిర‌ణం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. తెలంగాణలో ప‌వ‌న్ త‌న రాజ‌కీయ‌ వ్యూహం ఏ మాత్రం ప్ర‌క‌టించ‌న‌ప్ప‌టికీ వామ‌పక్షాలు ఆయ‌న‌వైపు చూస్తున్నాయి.

సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తాజాగా మీడియాతో మాట్లాడుతూ  తెలంగాణకు ప్రత్యామ్నాయ అభివృద్ధి విధానం అవసరమన్న తమ్మినేని సామాజిక న్యాయం అంటే కుల ప్రస్తావనే కాదు అన్ని వర్గాలకు విద్య, వైద్యం, సమాన న్యాయం కావాలని కోతున్నామన్నారు. కొత్తగా ఏర్పడిన కోదండరాం పార్టీ విధానాలు ఏంటో కూడా ఇంకా చెప్పలేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై కోదండరాం అభిప్రాయాన్ని సమర్థిస్తున్నామన్న తమ్మినేని రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన వామపక్షాలతో కలిసి పనిచేస్తోంది....ఏ సమావేశం ఏర్పాటు చేసిన లెఫ్ట్ పార్టీలను ఆహ్వానించడంతో పాటు తాజాగా సీపీఎం, సీపీఐ నేతలతో కలిసి జనసేనాని ప్రత్యేక హోదా కోసం పాదయాత్ర కూడా చేశారని పేర్కొన్నారు. అయితే తెలంగాణలో పరిస్థితి వేరన్నారు.

ఇప్పటి వరకు ఇక్కడ జనసేనతో కమ్యూనిస్టులు కలిసి పనిచేసింది లేదని త‌మ్మినేని తెలిపారు. గ‌తంలో ఓ సారి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను క‌లిశామ‌ని ఆయ‌న వివ‌రించారు. తెలంగాణపై జనసేన వైఖరి ఏంటో చెబితే కలిసి పనిచేసేది లేనిది తెలుస్తుందన్నారు . ఈనెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో సీపీఎం జాతీయ మహాసభలను నిర్వహించనున్నట్టు  తమ్మినేని వీరభద్రం తెలిపారు. దీనిలో భాగంగా తలపెట్టిన హైదరాబాద్‌ ఫేస్ట్‌ని మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభిస్తారని తెలిపారు. చివరి రోజు భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని పరేడ్ గ్రౌండ్‌లో సభ అనుకున్నాం కానీ, ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదన్నారు. అనుమతి విషయంలో కేంద్రం వివక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ను కలిసిన సందర్భంగా సరూర్ నగర్ గ్రౌండ్‌లో సభ ఏర్పాటుకు సీఎంను అడిగామని ఆయన సహకరిస్తామని చెప్పినట్టు తమ్మినేని తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English