మోడీని తిట్టే ద‌మ్ము నీకెక్క‌డిది జ‌గ‌న్‌?

మోడీని తిట్టే ద‌మ్ము నీకెక్క‌డిది జ‌గ‌న్‌?

తెలుగుదేశం పార్టీ యువ‌నేత‌, ఏపీ మంత్రి నారా లోకేష్ త‌న దూకుడు పెంచారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఉద్య‌మిస్తుఉన్న పార్టీ ర‌థ‌సార‌థి, ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు తోడుగా...జాతీయ ప‌రిణామాల నుంచి మొద‌లుకొని రాష్ట్రంలో సాగే రాజ‌కీయాల వ‌ర‌కు లోకేష్ దూకుడుగా స్పందిస్తున్నారు. ప్ర‌తిప‌క్షాల‌ను కుక్క‌లు, పిల్లుల‌తో పోల్చిన బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షాకు గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఘాటు కౌంట‌ర్‌ను లోకేష్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఏపీ ప్ర‌జ‌ల ఆకాంక్ష కోసం తాము పోరాడుతుంటే విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. అదే రీతిలో ఏపీ విప‌క్ష నేత‌, వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌పై కూడా లోకేస్ మండిప‌డ్డారు.

ఏపీ ప్ర‌త్యేక హోదా విష‌యంలో జ‌గ‌న్ నాట‌కాలు ఆడుతున్నార‌ని లోకేష్ మండిప‌డ్డారు. ఈమేర‌కు రెండు ట్వీట్ల‌లో త‌న భావాలు పంచుకున్నారు. ఢిల్లీ పెద్దల మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించడానికి 5 కోట్ల తెలుగు ప్రజలు తమ రోషాన్ని చూపిస్తుంటే, ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీని నిలదీసే దమ్ము, ధైర్యం లేని జగన్ ప్రజల్ని మోసం చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ కాళ్ల మీద పడుతూ, పీఎంఓ చుట్టూ తిరుగుతూ ప్రత్యేక హోదా ముసుగులో కేసుల మాఫీ కోసం జగన్ మరోసారి క్విడ్ ప్రో కో నాటకం మొదలుపెట్టాడు` అంటూ లోకేష్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

ఏపీకి చెందిన ప్ర‌జలంతా ప్ర‌త్యేక హోదా కోసం పాటుప‌డే వారు ఉద్య‌మాలు చేసేందుకు, ఐక్యంగా క‌లిసి సాగేందుకు ముందుకు సాగేందుకు స‌న్న‌ద్ధం అవుతున్న స‌మ‌యంలో వైఎస్ జ‌గ‌న్ త‌న సొంత ఎజెండా మేర‌కు ముందుకు సాగ‌డం ఏపీ ప్ర‌యోజ‌నాలకు గొడ్డ‌లి పెట్ట‌ని లోకేష్ వ్యాఖ్యానించారు. ప్ర‌తిప‌క్ష నేత‌గా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం గ‌ళం విప్పాల్సిన జ‌గ‌న్ ఇలా త‌న సొంత రాజ‌కీయాల‌కు పెద్ద పీట వేయ‌డం స‌రికాద‌ని లోకేష్ ప‌లువురితో వ్యాఖ్యానించినట్లు స‌మాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు