అమితి షా తిట్లు - లోకేష్ ఘాటు కౌంట‌ర్‌

అమితి షా తిట్లు - లోకేష్ ఘాటు కౌంట‌ర్‌

త్వ‌ర‌లో అమిత్ షా గ‌ర్వ‌భంగం... అనే ఒక గుణ‌పాఠం వినాల్సి వ‌స్తుందేమో మ‌నం. రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు కొత్తేం కాదు. అవి చాలా సాధార‌ణం.  కానీ ఒక్కోసారి రాజ‌కీయ నేతల నోటి దూల చాలామందిని తీవ్రంగా హ‌ర్ట్ చేస్తుంది. ఈరోజు ముంబైలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మరోసారి రెచ్చిపోయారు. విపక్షాలపై నిప్పులు చెరుగుతూ *మనుషులా.. జంతువులా..* అంటూ కడిగి పారేశారు.  విపక్షాలను కుక్కలు, పిల్లులు, పాములతో పోల్చుతూ వివాదాస్ప‌ద వ్యాఖ్యలు చేశారు. ముంబైలో జరిగిన ఆవిర్భావ దినోత్స‌వంలో ఆయ‌న మాట్లాడుతూ అమిత్ షా మాట్లాడుతూ ఈ ప‌రుష వ్యాఖ్య‌లు చేశారు. విపక్షాలన్నీ కుక్కలు, పిల్లులు, ముంగిసలు, పాముల్లాంటివని.. ఓ పెద్ద ఉప్పెన వస్తే అవన్నీ చెట్టేక్కేస్తాయంటూ ఎద్దేవా చేశారు.

2019 ఎన్నికల తర్వాత ఎవరిసత్తా ఏంటో తెలుస్తుందని, ఇకనైనా మేల్కోవాలంటూ ప్రతిపక్షాలను అమిత్ షా హెచ్చరించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తమ కూటమి ఉప్పెనలా విజృంభిస్తే.. విపక్షాలు వరద నీటిని చూసి భయపడి చెట్టేక్కే రకాలని అమిత్ షా తెలిపారు. ప్రజల్లో తమ పార్టీపై విశ్వాసం సన్నగిల్లలేదని, ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ ఇదివరకు సాధించిన విజయాలే అందుకు నిదర్శనమని అమిత్ షా తెలిపారు. పార్లమెంట్ సమావేశాలను ప్రధాని మోడీ చాలా సవ్యంగా జరిగేలా జాగ్రత్తలు తీసుకున్నా, విపక్షాలు మాత్రం సభ సమయాన్ని వృథా చేశాయని అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ వల్లే పార్లమెంట్ సరిగా జరగలేదని అమిత్ షా ఆరోపించారు. ఏ అంశంపై అయినా ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందన్నారు. పార్లమెంట్ నుంచి ప్రభుత్వం పారిపోతోందన్న కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ వాదనను అమిత్ షా తిప్పికొట్టారు. ఎప్పుడైనా… ఎక్కడైనా చర్చకు సిద్ధమని బీజేపీ జాతీయాధ్యక్షుడు స‌వాల్ విసిరారు. ప్రతీ బూత్ స్థాయిలోనూ బీజేపీ జెండా ఎగరాలని కార్యకర్తలకు అమిత్ షా దిశానిర్దేశం చేశారు.

దీనికి నారా లోకేష్  ట్విట్ట‌రులో ఘాటైన కౌంట‌ర్ ఇచ్చారు. *ఐదు కోట్ల ప్ర‌జ‌ల‌ రాష్ట్రం కోసం పోరాడుతున్న మ‌న‌ల్ని అమిత్ షా ఈరోజు కుక్క‌ల‌తో పోల్చాడు. పాములు, ముంగిస‌లు అన్నాడు. నాలుగేళ్ల పాటు మ‌నల్ని అంధ‌కారంలో ఉంచ‌డ‌మే కాకుండా త‌ల‌పొగ‌రుతో మాట్లాడుతున్నారు. వినాశ‌కాలే విప‌రీత‌బుద్ధి. బీజేపీకి గుణ‌పాఠం చెప్పాల్సిన టైం వ‌చ్చింది అంటూ నారా లోకేష్ అమిత్‌షాకు, బీజేపీకి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. దేశ నాశ‌నానికి కార‌ణ‌మైన బీజేపీని బాయ్‌కాట్ చేయాలంటూ ఆయ‌న పిలుపునిచ్చారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు