మ‌నోళ్ల‌కు బిట్‌కాయిన్ టోపీ..రూ.2 వేల కోట్లట

మ‌నోళ్ల‌కు బిట్‌కాయిన్ టోపీ..రూ.2 వేల కోట్లట

కొద్దికాలం క్రితం వ‌ర‌కు హ‌ల్ చ‌ల్ చేసిన బిట్‌కాయిన్ వ్యాపారం త‌న షాకింగ్ ఎపిసోడ్‌ల‌ను తెర‌మీద‌కు తెచ్చింది. బిట్‌కాయిన్‌పై మోజుపడిన వేలాది మందికి రూ.2,000 కోట్ల మేర ఢిల్లీ వ్యాపారి ఒక‌రు టోక‌రా పెట్టాడు. మదుపరుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసం చేసిన సదరు వ్యాపారి.. ఇప్పుడు పుణె పోలీసుల అదుపులో ఉన్నాడు.

ఢిల్లీకి చెందిన బిట్‌కాయిన్ ఎంటర్‌ప్రెన్యూర్ అమిత్ భరద్వాజ్ వలలో దేశవ్యాప్తంగా 8,000 మందికిపైగా పడగా, వీరి నుంచి మొత్తం రూ.2,000 కోట్లను దండుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే అదుపులోకి తీసుకున్న ఏడుగురు భరద్వాజ్ అనుచరులు అందించిన సమాచారంతో పుణె పోలీసులు.. ఢిల్లీ విమానాశ్రయంలో బ్యాంకాక్‌కు వెళ్తున్న భరద్వాజ్‌నూ అరెస్టు చేశారు.

2014లో ఓ ఆన్‌లైన్ మార్కెటింగ్ వ్యవస్థను భరద్వాజ్ ప్రారంభించగా, బిట్‌కాయిన్ మైనింగ్ ఆపరేషన్స్ పేరుతో కొన్ని సంస్థల్ని ఏర్పాటు చేశాడు. వీటిలో గెయిన్ బిట్‌కాయిన్ చైనాలో బిట్‌కాయిన్ మైనింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తోందని, హాంకాంగ్‌లో దీని ప్రధాన కేంద్రం ఉందని భరద్వాజ్ ప్ర‌క‌టించాడు. ఈ క్రమంలోనే అధిక లాభాలు వస్తాయంటూ మదుపరులను పెట్టుబడుల కోసం ఆకర్షించాడు.

ఇంకా అనేక రకాలుగా మభ్యపెట్టి పెట్టుబడులను చేజిక్కించుకున్నాడనే ఆరోపణలు భరద్వాజ్‌పై ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. కాగా, ఢిల్లీలోని షాలిమార్ బాగ్‌లో బిట్‌కాయిన్ వ్యాపారాన్ని ప్రారంభించిన భరద్వాజ్.. చైనాకు దాన్ని విస్తరించాడని, దుబాయ్‌లోనూ ఓ ఆఫీసును ఏర్పాటు చేశాడని పోలీసులు వివరించారు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English