జైట్లీ హెల్త్ కండీష‌న్ బాగోలేదా?

జైట్లీ హెల్త్ కండీష‌న్ బాగోలేదా?

ఒక‌రి త‌ర్వాత ఒక‌ర‌న్న‌ట్లు బీజేపీ ముఖ్య‌నేత‌లు ప‌లువురు అనారోగ్యానికి గుర‌వుతున్నారు. కేంద్రఆర్థిక మంత్రి.. ఆంధ్రోళ్ల‌కు కంటి నిండా క‌నుకు లేకుండా..త‌న మాట‌ల‌తో కోట్లాది మంది క‌డుపు మండేలా చేసే అరుణ్ జైట్లీ ఆరోగ్యం ఏ మాత్రం బాగోలేద‌ట‌. ఆయ‌న కిడ్నీలు పాడైన‌ట్లుగా చెబుతున్నారు. త్వ‌ర‌లోనే ఆయ‌న‌కు శ‌స్త్ర‌చికిత్స‌లు చేయాల్సి ఉంటుంద‌ని వైద్యులు చెబుతున్న‌ట్లు చెబుతున్నారు.

ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి ఏ మాత్రం బాగోక‌పోవ‌టంతో ఆయ‌న సోమ‌వారం నుంచి ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు రావ‌టం లేదు. ఆఫీసు ప‌నులు సైతం ఇంట్లో నుంచే పూర్తి చేస్తున్నారు. ఆయ‌న ప‌రిస్థితి ఎంత‌లా బాగోలేదంటే.. ముగిసిన రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం నేప‌థ్యంలో కొత్త‌గా ఎన్నికైనప్ప‌టికీ ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌లేని ప‌రిస్థితి.
రికార్డుల ప్ర‌కారం జైట్లీ రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ఈ నెల 2 తేదీతో ముగిసింది. అయితే.. యూపీ నుంచి మ‌ళ్లీ ఎన్నికైన ఆయ‌న ప్ర‌మాణ‌స్వీకారం చేయాల్సి ఉంది.

ఆరోగ్య ప‌రిస్థితి ఏ మాత్రం బాగోక‌పోవ‌టంతో ఆయ‌న ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు రావ‌టం లేదు. తాజా ఆరోగ్య ప‌రిస్థితి నేప‌థ్యంలో ఆయ‌న త‌న లండ‌న్ ప‌ర్య‌ట‌న‌ను సైతం ర‌ద్దు చేసుకున్నారు. ఆ మ‌ధ్య‌న కేంద్ర‌మంత్రి సుష్మాస్వ‌రాజ్‌.. ఈ మ‌ధ్య‌నే గోవా ముఖ్య‌మంత్రి పారీక‌ర్ లాంటి నేత‌లు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురికాగా.. తాజాగా ఆ జాబితాలో జైట్లీ చేశారు.
కిడ్నీ ఇన్ఫెక్ష‌న్ పెరుగుతోంద‌ని.. బ‌య‌ట‌కు వెళ్లొద్ద‌న్న వైద్యుల సూచ‌న‌తో ఇంట్లో నుంచే ఆఫీసు కార్య‌క‌లాపాలు సాగిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. ఇంట్లో నుంచే ఫైల్స్ పై సంత‌కాలు చేస్తున్నారు. ఎయిమ్స్ వైద్యులు జైట్లీ ఇంట్లోనే ఆయ‌న‌కు చికిత్స చేస్తున్నారు.

రానున్న రోజుల్లో ఆయ‌న ఎయిమ్స్ లో చేరొచ్చ‌ని తెలుస్తోంది. ఒక‌వేళ శ‌స్త్ర చికిత్స చేయించుకుంటే కొద్ది నెల‌ల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంద‌ని తెలుస్తోంది. జైట్లీ రెండు కిడ్నీలు పాడ‌య్యాయ‌ని.. ఒక కిడ్నీ మార్పిడి ఆప‌రేష‌న్ చేయాల్సి ఉంటుంద‌ని చెబుతున్నారు. జైట్లీకి మ్యాచ్ అయ్యే కిడ్నీ కోసం అవ‌స‌ర‌మైన లాంఛ‌నాలు పూర్తి చేయాల్సి ఉంద‌ని.. అది జ‌రిగిన వెంట‌నే ఆయ‌న‌కు ఆప‌రేష‌న్ చేయొచ్చ‌ని చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English