పెళ్లి చేసుకున్నా.. పాత్రలు పండిస్తున్నారంతే

పెళ్లి చేసుకున్నా.. పాత్రలు పండిస్తున్నారంతే

హీరోయిన్స్ కు క్రేజ్ ఉండాలంటే.. ఎంతకాలమైనా వాళ్లు పెళ్లి చేసుకోకుండానే ఉండాలి. ఒక వేళ చేసుకున్నా ఆ సంగతి బైటకు ఏ మాత్రం చెప్పకుండా తెలియకుండా ఉండాలి. పెళ్లయిన అమ్మాయిలను హీరోయిన్స్ గా ఆడియన్స్ ఒప్పుకోరు.. పెళ్లి చేసుకున్నాక రకరకాల వంకలు పెట్టి ఇబ్బంది పెడతారు.. ఇప్పటివరకూ సినిమా హీరోయిన్స్ పై ఇండస్ట్రీలో ఉన్న మాటలు ఇవి. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే.. ఇకపై ఇలాంటివన్నీ మర్చిపోవచ్చేమో అనిపిస్తుంది.

పెళ్లి చేసుకున్నాక కూడా సినిమాలు చేయడమే కాదు.. మాంచి హిట్స్ కూడా కొట్టేస్తున్నారు. రీసెంట్ గా రంగస్థలంలో రామలక్ష్మిగా మెప్పించిన సమంత.. ఇప్పుడు అక్కినేని వారి ఇంటి కోడలు. పెళ్లి తరువాత ఈమె కొట్టిన గాట్టి ఇండస్ట్రీ హిట్ రేంజ్ మూవీ ఇది. పైగా గ్లామర్ మెరుపులు కూడా ఏమాత్రం తన స్థాయికి తగ్గకుండా తెగ మెరిపించింది. నెలన్నర క్రితం తమిళంలో నాచియార్ అనే మూవీ చేసింది సూర్య వైఫ్ జ్యోతిక. కర్కశమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి మెప్పించడమే కాదు.. సక్సెస్ కూడా సాధించింది. మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న మలయాళీ హీరోయిన్ శివద నటించిన శిక్కారి శంబు... జనవరిలో  వచ్చి సక్సెస్ సాధించింది. ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ అయిపోయిన రష్మిక మందనకు.. ఇప్పటికే ఎంగేజ్మెంట్ అయిపోయినా.. ఇంకా వరుస సినిమాలు చేసేస్తోంది.

వీళ్లంతా సౌత్ సుందరాంగులు అయితే.. నార్త్ లోనూ ఈ ట్రెండ్ కొనసాగుతోంది. జస్ట్ ఈ ఏడాది వరకే చూసుకున్నా.. పరి చిత్రం రిలీజ్ కు ముందు విరాట్ కోహ్లీ భార్యగా మారిన అనుష్క శర్మ.. ఆ సినిమాతో ఆకట్టుకుంది. సీనియర్ హీరోయిన్ రాణీ ముఖర్జీ హిచ్కీ మూవీతో తెగ మెప్పించేసింది. ఆమె దర్శకుడు ఆదిత్య చోప్రాను పెళ్ళిచేసుకున్న సంగతి తెలిసిందే. ఇక నాలుగేళ్ళ క్రితమే లండన్ కుర్రాడిని పెళ్ళి చేసుకున్న రాధిక ఆప్టే ప్యాడ్ మ్యాన్ సినిమాలో బాగా అలరించింది. త్వరలోనే కరీనా కపూర్ కూడా సత్తా చాటబోతోంది. పైగా అమ్మడు పెళ్ళయ్యాక కూడా కి అండ్ కా సినిమాలో పెదాల ముద్దులతో చితక్కొట్టేసింది. ఇదంతా చూస్తుంటే.. పెళ్లయిన హీరోయిన్ అనే ట్యాగ్ లైన్ ను ఇక మర్చిపోవాల్సిన రోజులు వచ్చినట్లుగా అనిపించడం లేదూ!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు