జేసీ రెచ్చిపోయాడు

జేసీ రెచ్చిపోయాడు

బస్సు ప్రమాదం తర్వాత జేసీ బుర్ర బాగా దెబ్బతిన్నట్లుంది. పార్టీని ఏకుతాడు. అమ్మను పొగుడుతాడు. రాయలతెలంగాణ అంటున్నాడు. సీమాంధ్ర రాజధాని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన తాజాగా ఎటూ పొసగని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మాచర్లను సీమాంధ్రకు రాజధానిని చేయాలి. నాకు అక్కడ భూముల్లేవు. అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పాను. (నిన్నటి వరకు రాయల తెలంగాణ డిమాండ్ చేశారు. అదేమైంది జేసీ?)

బొత్స, కిరణ్ తోడు దొంగలని వ్యాఖ్యానించారు. (కానీ ఎందుకో చెప్పలేదు) అదే క్షణంలో అదే నోటితో కిరణ్ మాత్రం పక్కా సమైక్యవాది అన్నారు. తోడు దొంగలు అంటే కిరణ్ సమైక్యవాది కాదన్నట్టే కదా జేసీ?

పార్టీ గీత దాటితే చర్యలు అన్న బొత్స మాటలకు స్పందిస్తూ... "ఆయన ఉన్నదే అందుకు కదా'' అన్నారు.

సీమాంధ్ర కేంద్ర మంత్రులు నిజాలు దాచి ప్రజలను మోసం చేశారని అన్నారు. అవేంటో మాత్రం ప్రజలకు చెప్పకుండా ఈయన కూడా దాస్తున్నారు.

ఇదండీ జేసీ మానసిక పరిస్థితి!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు