రాజమౌళి రూట్లోనే సుకుమార్

రాజమౌళి రూట్లోనే సుకుమార్

మెగా పవర్ స్టార్ తో రంగస్థలం అంటూ 1980ల కాలం నాటి పీరియాడిక్ మూవీ తీసి.. దర్శకుడు సుకుమార్ పెద్ద సెన్సేషన్ నే సృష్టించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్స్ కంటిన్యూ చేస్తూనే ఉంది. నాన్ బాహుబలి రికార్డులు ఈ సినిమా ఖాతాలో పడ్డం ఖాయం అంటున్నారు ట్రేడ్ జనాలు. రంగస్థలం తర్వాత సుకుమార్ ఏ సినిమా చేయబోతున్నాడనే ఆసక్తి అంతటా కనిపిస్తోంది.

తన తర్వాతి చిత్రాన్ని అల్లు అర్జున్ తో చేసేందుకు సుకుమార్ సిద్ధమవుతున్నాడంటూ టాక్స్ వినిపించాయి. గతంలోనే కొంత నెరేషన్ ఇచ్చాడని.. మిగతా పార్ట్ ఇప్పుడు చెప్పబోతున్నాడని అన్నారు. ఇప్పుడేమో ప్రభాస్ తో సినిమా అంటూ కొత్త టాక్ మొదలైంది. ప్రభాస్ తో వర్క్ చేయాలనే ఉద్దేశ్యాన్ని సుకుమార్ స్వయంగా వెలిబుచ్చాడని.. ఇద్దరూ మాట్లాడుకున్న తర్వాత.. కలిసి ప్రాజెక్టు చేసేందుకు పరస్పరం ఓకే అనేసుకున్నారని చెబుతున్నారు. కానీ దాదాపు ఏడాదిన్నర పాటు రంగస్థలం కోసం కష్టపడిన సుకుమార్ ఆలోచనలు వేరేగా ఉన్నాయట.

ఈ విషయంలో రాజమౌళిని ఫాలో అయిపోవాలని ఫిక్స్ అయిపోయాడట సుకుమార్. బాహుబలి కోసం సుదీర్ఘ కాలం వెచ్చించిన తర్వాత ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్లాడు జక్కన్న. ఇప్పుడు సుక్కు కూడా యురోప్ వెళ్ళి నెల రోజులు రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాడట. తిరిగి వచ్చిన తర్వాతే తన నెక్ట్స్ ప్రాజెక్టు గురించి ఆలోచిస్తాడట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English