సాయిరెడ్డి మ‌రోమారు బుక్కైపోయారా?

సాయిరెడ్డి మ‌రోమారు బుక్కైపోయారా?

ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం సాగుతున్న పోరులో అంద‌రి కంటే ముందుగా తానే ఉద్య‌మం చేప‌ట్టాన‌ని, ఆది నుంచి త‌న స్టాండ్ ఒక‌టేన‌ని చెబుతూ వ‌స్తున్న విప‌క్ష వైసీపీ నిజంగానే త‌న‌ను తానే బుక్ చేసుకుంటున్న వైనం ఇప్పుడు నిజంగానే ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. విప‌క్షంలో ఉన్న పార్టీగా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై పోరాటాలు చేయ‌డం ఏ పార్టీకైనా క‌నీస బాధ్య‌త‌. తాను చేస్తున్న ఆందోళ‌న‌లు మాత్ర‌మే నిజ‌మైన‌వి, ఇత‌రుల‌వి కాద‌ని చెప్పే ఆ పార్టీ మాట‌లు న‌మ్మేందుకు జ‌న‌మేమీ గుడ్డిగా లేరు క‌దా. ఇప్పుడు ఇలాంటి వాద‌నే బాగా వినిపిస్తోంది.

ఓ వైపు ఉద్య‌మం అంటూనే... మ‌రోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేత‌ల‌తో వైసీపీ నేత‌ల వ‌రుస భేటీలు, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కాళ్లు తాకైనా సరే ఆయ‌న‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు వైసీసీ రాజ్య‌స‌భ స‌భ్యుడు వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి చేసిన య‌త్నం... ఇలా ప్ర‌తి విష‌యాన్ని నిశితంగా గ‌మ‌నిస్తున్న ప్ర‌జ‌లు... ఆ పార్టీ వైఖ‌రి ఏమిటో ఇప్ప‌టికే ఓ అంచ‌నాకు వ‌చ్చి ఉంటార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. జాతీయ మీడియాలు ప‌లుమార్లు బీజేపీతో -టైఆప్ గురించి వైసీపీ నేత‌ల‌ను ప్ర‌శ్నిస్తే వాళ్లు దాట‌వేస్తూ వ‌స్తున్నారు. ఇదంతా రాజ‌కీయ అనుభ‌వ రాహిత్యం వ‌ల్లే అనే విష‌యం అర్థ‌మైపోతుంది. మోడీని ఒక్క‌మాట కూడా అన‌కుండా ఆయన సార‌థ్యంలోని ప్ర‌భుత్వంపై పెట్టిన‌ అవిశ్వాసం ఎంత‌కీ చ‌ర్చ‌కు రాక‌పోవ‌డంతో కేంద్రంపై మ‌రింత ఒత్తిడి పెంచే క్ర‌మంలో రాజీనామాల‌కు కూడా సిద్ధ‌మేన‌ని వైసీపీ లోక్ స‌భ స‌భ్యులు ఓ వైపు ప్ర‌క‌టిస్తే... విజ‌య‌సాయి అతి విన‌యం ఆ పార్టీని న‌వ్వుల పాలు చేస్తోంది.

తాజాగా త‌న‌ను అవ‌మానించార‌ని చంద్ర‌బాబుపై స‌భా హ‌క్కుల ఉల్లంఘ‌న‌ నోటీసు ఇవ్వ‌బోయి... మోడీపై భ‌క్తిని చాటుకునే క్ర‌మంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపైని కూడా టీడీపీ అధినేత అవ‌మానించార‌ని స‌భా హ‌క్కుల ఉల్లంఘ‌న నోటీసు ఇచ్చారు విజ‌య సాయిరెడ్ది. దీంతో మోదీపై వైసీపీ విశ్వాసం మ‌రోసారి బ‌హిర్గ‌తం అయ్యింది. సోష‌ల్ మీడియాలో ఈ పాయింటు మీద వైసీపీని ఆడుకుంటున్నారు. చంద్రబాబు నేరుగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై దాడి చేశారని బాబును ఇరికించ‌బోయి తాను బొక్కాబోర్లా ప‌డ్డారు సాయిరెడ్డి.  

ఈ నోటీసు పుణ్యాన‌ సాయిరెడ్డి.. త‌న‌నే కాకుండా ప్ర‌ధాని మోదీని అవ‌మానించినా కూడా స‌హించేది లేద‌ని బీజేపీ త‌ర‌ఫున వ‌కాల్తా పుచ్చుకున్న‌ట్లుగా తేలిపోయింద‌న్న వాద‌న వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు