బాబు ఢిల్లీ టూర్‌... వెంట‌నే కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించిన జ‌గ‌న్‌

బాబు ఢిల్లీ టూర్‌... వెంట‌నే కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించిన జ‌గ‌న్‌

ఏపీ ప్ర‌త్యేక హోదా కోసం ఏపీలో మొద‌లైన రాజ‌కీయ వేడి దేశ రాజ‌ధాని ఢిల్లీని చేరిన సంగ‌తి తెలిసిందే. జ‌గ‌న్ నిరాహార దీక్ష‌లు చేస్తా అంటుంటే...  వాటితో ఏం రాదు, అస‌లు మోడీయ రాకుండా చేస్తే మ‌న‌కు కావ‌ల్సింది కేంద్రం నుంచి తెచ్చుకోవ‌చ్చ‌ని బాబు ప్లాన్ చేస్తున్నాడు. హోదా సాధ‌న అన్న‌ది జ‌గ‌న్‌ చెప్పినంత సింఫుల్ కాద‌న్న విష‌యం తెలిసిందే. ఇంకా.. స‌రిగ్గా చెప్పాలంటే.. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన చందం లాంటి ప‌రిస్థితులు ఏర్ప‌డితే త‌ప్పించి ఏపీ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు తీరే ప‌రిస్థితి లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లోనూ త‌న‌కున్న ప‌రిమిత అవ‌కాశాల్ని మొత్తంగా వినియోగించి కేంద్రం మీద వినూత్నంగా ఒత్తిడి తెచ్చేందుకు చంద్ర‌బాబు ప‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఇందులో భాగంగా ఇప్ప‌టికే మంత్రివ‌ర్గం నుంచి, కూట‌మి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి  ఏం చేయ‌నున్నార‌న్న సంచ‌ల‌న విష‌యాల్ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించి కేంద్రం ఉలిక్కిప‌డేలా చేశారు. ఇత‌ర పార్టీల‌న్నీ త‌మ వైపు చూసేలా చేయ‌డంతో పాటు రాజ‌కీయ‌మే ల‌క్ష్యంగా మోడీని ఒక్క‌మాట అన‌ని జ‌గ‌న్ కు నిద్ర‌లేకుండా చేస్తోంది తెలుగుదేశం పార్టీ.

ఇదిలా ఉంటే.. ఈ రోజు (సోమ‌వారం) మ‌రోసారి త‌మ ఉద్య‌మ కార్య‌చ‌ర‌ణ‌ను ప్ర‌క‌టించారు జ‌గ‌న్‌.   తాజా ప్ర‌క‌ట‌న‌తో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తేలా చేస్తాన‌ని అన్నారు. తాజాగా ట్విట్ట‌ర్ ను వేదిక‌గా చేసుకొని తన మాట‌ను చెప్పారు జ‌గ‌న్‌. యువ‌త ఉద్యోగాల‌కు ప్ర‌త్యేక హోదా ప‌ర్యాయ‌ప‌దమ‌న్న జ‌గ‌న్‌.. హోదా ఇవ్వ‌కుండా ఏపీకి అన్యాయం చేస్తున్న కేంద్రానికి వ్య‌తిరేకంగా యూనివ‌ర్సిటీ ప్రాంగ‌ణాల్లో విద్యార్థులు నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని పిలుపునిచ్చారు.

హోదా సాధ‌న కోసం ఓప‌క్క రాజ‌కీయ కార్యాచ‌ర‌ణ‌తో పాటు.. ఏపీలోని అన్ని వ‌ర్గాల వారు త‌మ హ‌క్కుల కోసం పోరాడాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌న్న బాబు అఖిల ప‌క్షాన్ని ఎగ్గొట్టి... ఇపుడు ఢిల్లీలో దీక్ష‌లు అంటున్నారు.  హోదా పేరుతో హ‌డావుడి చేస్తూ.. ఎంత‌కూ వంగ‌ని కేంద్రంపై మాట‌ల యుద్ధంతో వ‌చ్చే మైలేజీ ఆస‌రాతో 2019 ఎన్నిక‌ల్లో సెంటిమెంట్ సృష్టించాల‌ని భావిస్తున్న జ‌గ‌న్ కు చంద్ర‌బాబు తాజా టూర్  బీపీ పెంచ‌టం ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు