కేసీఆర్ ఢిల్లీలో టూర్‌లో కొత్త ట్విస్ట్‌కు చాన్స్‌

కేసీఆర్ ఢిల్లీలో టూర్‌లో కొత్త ట్విస్ట్‌కు చాన్స్‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పా్టీ అధినేత కేసీఆర్ త‌న రాజ‌కీయ దూకుడును త‌గ్గించుకుంటున్నారా?  ఢిల్లీ వేదిక‌గా స‌త్తా చాటాల‌నుకున్న కేసీఆఱ్ ఇందుకు పోరాటం కంటే లాబీయింగ్ ద్వారానే ప‌రిష్కారం సాధించానుకుంటున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడే కొన్ని విషయాలను రాష్ట్రాలకే వదిలేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ డిమాండ్‌ చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఆయన పార్లమెంటు సమావేశాల తర్వాత ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. అయితే జాతీయ రాజకీయాల్లో వస్తున్న మార్పులతో దీక్ష యోచనను విరమించుకున్నారని టీఆర్ఎస్‌పార్టీ నేతలు చెబుతున్నారు.

కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రత్నాయ్నాయంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ కోసం కేసీఆర్‌ నడుం బిగించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా గత నెల మార్చిలో కేసీఆర్‌ పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో సమావేశమయ్యారు. ఈ నెల 3,4 తేదీల్లో ఢిల్లీ వెళ్లి మరికొన్ని ప్రాంతీయ పార్టీల నేతలను కేసీఆర్‌ కలవనున్నారని టీఆర్ఎస్‌పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ క్ర‌మంలో ముందుగా దీక్ష‌కు దిగే బ‌దులు ఆయా పార్టీల‌తో భేటీ అయి వారి అభిప్రాయాలు సేకరించి ఉద్య‌మ కాచ‌ర్యాచ‌ర‌ణ సిద్ధం చేస్తార‌ని తెలుస్తోంది.

కేంద్రానికి సంబంధించి ప్రతి ఒక్క కార్యక్రమానికి మద్దతు తెలిపినా రాష్ట్రప్రభు త్వానికి సహకారం లభించడం లేదని టీఆర్ఎస్‌పార్టీ మండిపడుతున్నది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రాల హక్కుల ఎజెండాను ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది. అయితే, పార్లమెంటు సమావేశాల తర్వాత కేంద్రంలో రాజకీయ పరిణామాలు మలుపు తిరుగుతాయన్న ఆలోచనతో టీఆర్ఎస్‌పార్టీ ఉంది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిరాహార దీక్ష యోచనను వెనక్కు తీసుకున్నట్టు విశ్వసనీయ వ‌ర్గాల‌ సమాచారం. ఈ అంశానికి ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టిన తర్వాత దీనిపై ఒక నిర్ణయానికి రావాలన్న యోచనలో ఉన్నామని టీఆర్ఎస్‌పార్టీ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు. ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన ఎంపీల సమావేశంలోనూ చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు