కేసీఆర్ మంచి సింగ‌ర్ అట‌!

కేసీఆర్ మంచి సింగ‌ర్ అట‌!

తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావుకు తెలుగు భాష‌, సాహిత్యం, క‌ళ‌ల‌పై మ‌క్కువ ఎక్కువ‌న్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల‌ను కొద్దిరోజుల క్రితం కేసీఆర్ స‌ర్కార్ అంగ‌రంగ‌వైభ‌వంగా నిర్వ‌హించిన విషయం విదిత‌మే. తాను సాహిత్యపిపాస‌కుడ‌న‌ని, గ‌తంలో కొన్ని వేల పుస్త‌కాలు చ‌దివాన‌ని కేసీఆర్ ఓ సంద‌ర్భంలో అన్నారు.

అయితే, కేసీఆర్ లో ఓ మంచి గాయ‌కుడు కూడా దాగి ఉన్నాడ‌న్న విష‌యాన్ని ఆయ‌న త‌న‌యుడు కేటీఆర్ స్వ‌యంగా వెల్ల‌డించారు. త‌న తండ్రి చాలా బాగా పాట‌లు పాడ‌తార‌ని, ఆయ‌న కాలేజీలో చ‌దువుకునే రోజుల్లో అనేక పోటీల‌లో పాల్గొని బ‌హుమ‌తులు కూడా గెలుచుకున్నారని కేటీఆర్ అన్నారు. ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాల సుబ్ర‌హ్మణ్యానికి కేసీఆర్ అభిమాని అని చెప్పారు.

హైద‌రాబాద్ లోని స్ప‌ర్స్ ఆసుపత్రికి చేయూతనిచ్చేందుకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలో ఓ సంగీత విభావరి నిర్వ‌హించారు. ఆ కార్య‌క్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఐటీ, మునిసిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌సంగించిన కేటీఆర్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. బాలుగారికి కేసీఆర్ పెద్ద ఫ్యాన్ అని, ఆయ‌న పాడుతున్న‌పుడు ప్ర‌త్య‌క్షంగా చూడటం తనకెంతో ఆనందాన్నిచ్చింద‌ని అన్నారు.

 రాజకీయాల్లో తీరిక లేకుండా ఉన్నందున పాటలు వినే అవకాశం త‌న‌కు దొర‌క‌ద‌ని, బాలుగారి పాటలు విని మైమరచి పోయానని కేటీఆర్ అన్నారు. స్పర్శ్ ఆసుపత్రికి స్థలం కేటాయించామ‌ని, నిర్మాణ అనుమతుములు, మిన‌హాయింపుల‌ విషయంలోకూడా ప్ర‌భుత్వం స‌హాయ‌స‌హ‌కారాలుంటాయ‌ని అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు