#ప్ర‌త్యేక హోదా: సీఎంతో సినీ ప్ర‌ముఖుల భేటీ!

#ప్ర‌త్యేక హోదా: సీఎంతో సినీ ప్ర‌ముఖుల భేటీ!

ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన వారెవ‌రూ స్పందించ‌డం లేదంటూ విమ‌ర్శ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో కొన్ని టీవీ చానెళ్లు లైవ్ డిబేట్ లు కూడా నిర్వ‌హించాయి. ఆ త‌ర్వాత ఏర్పాటు చేసిన ఓ ప్రెస్ మీట్ సంద‌ర్భంగా ప్ర‌త్యేక హోదాకు మ‌ద్ద‌తివ్వ‌డంపై `మా`అధ్యక్షుడు  శివాజీ రాజా స్పందించారు.

ఏపీకి ప్ర‌త్యేక్ష హోదా విష‌యంలో టాలీవుడ్ పూర్తి మ‌ద్ద‌తునిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ నేప‌థ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును టాలీవుడ్ ప్రముఖులు  శుక్ర‌వారం నాడు కలిశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం టీడీపీ ప్ర‌భుత్వం చేస్తున్న పోరాటానికి టాలీవుడ్ సంపూర్ణ మద్దతు తెలుపుతుంద‌ని వారు చెప్పారు.

ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన‌ టాలీవుడ్ ప్ర‌ముఖులు ఆయ‌న‌తో భేటీ అయ్యారు. రాఘ‌వేంద్ర‌రావు, అశ్వనీదత్, కేఎస్ రామారావు, కేఎల్ నారాయణ, జెమిని కిరణ్, టి.వెంకటేశ్వరరావు, జీకే తదితరులు....సీఎంతో చ‌ర్చించారు. అఖిలపక్షం పిలుపు ప్రకారం చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన వారంతా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతామని చెప్పారు.

షూటింగ్ లకు కూడా నల్ల బ్యాడ్జీలతోనే హాజరవుతామన్నారు. ఏప్రిల్ 6వ తేదీ వరకు త‌మ‌ నిరసనను  తెలియ‌జేస్తామ‌న్నారు. సీఎంతో మాట్లాడుతున్న సంద‌ర్భంగా వారంతా నల్ల బ్యాడ్జీలను ధరించ‌డం విశేషం. సీఎంతో టాలీవుడ్ ప్ర‌ముఖులు స‌రైన స‌మ‌యంలో భేటీ అయ్యార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ప్ర‌త్యేక హోదాకు మ‌ద్ద‌తుగా టాలీవుడ్ ప్ర‌ముఖులు ..సీఎంను క‌లిసిన టైమింగ్ క‌రెక్ట్ గా ఉంద‌ని అనుకుంటున్నారు. సోమ‌వారం నాడు అవిశ్వాస తీర్మానం చ‌ర్చ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉన్న స‌మ‌యంలో సీఎంను సినీ ప్ర‌ముఖులు క‌ల‌వ‌డం మంచి ప‌రిణామం అని చెబుతున్నారు. ప్ర‌త్యేక హోదాకు మ‌ద్ద‌తుగా టాలీవుడ్ ప్ర‌ముఖులు లేటెస్ట్ గా ఇచ్చిన ఎంట్రీ బాగుంద‌ని అనుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు