తెలంగాణకు ముఖ్యమంత్రులెందరు?

తెలంగాణకు ముఖ్యమంత్రులెందరు?

అంటే తెలంగాణకు ఇద్దరో ముగ్గురో ముఖ్యమంత్రులు వుంటారని కాదు.
తెలంగాణ రాష్ట్రం ఇంకా ఏర్పడలేదు, ముఖ్యమంత్రి కావడానికి తహతహ లాడే జనాల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఆలీ లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నట్టు వుందీ పరిస్థితి. కాని ఇది నిజం, కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువ కనుక లో ఇలాంటి వ్యవహారం మామూలే. పైగా మాట్లాడితే ముఖ్యమంత్రులను మార్చడం కాంగ్రెస్ కు అలవాటే.  కాని ఇంకా ఏర్పడని రాష్ట్రానికి, ఏర్పడ్డా కూడా నెలనో, రెండు నెల్లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉండే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రులయ్యే వారి జాబితా మాత్రం చాంతాడంత పెరుగుతోంది. ఆ జాబితాలో ఇప్పటి వరకు ఎవరున్నారో చూద్దాం.

ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సింది పంచాయత్ రాజ్ శాఖా మంత్రి జానారెడ్డి గూర్చి. ఎందుకంటే ఇప్పటికి తెలంగాణ కాంగ్రెస్ ను లీడ్ చేస్తోంది ఆయనే, అంతే కాదు ఆయన సిఎం కావచ్చన్న లీకేజీలు కూడా కాంగ్రెస్ వర్గాల నుంచి వెలుబడ్డాయి. ఇక తెలంగాణను సిడబ్ల్యూసి ప్రకటించిన వెంటనే ఇదంతా తన ఘనతేనంటూ అప్పటి వరకు ఎంత వెతికినా కనిపించని కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తెరపైకి వచ్చారు. ఆయన సిఎం అవుతారని ఊహించుకోవడంలో తప్పులేదనుకోండి, ఎందుకంటే కిరణ్ సిఎం కాకముందు, ఆతర్వాత కిరణ్ ను మారుస్తారన్న సమయంలోను ఏపి ముఖ్యమంత్రి రేసులో జైపాల్ రెడ్డి పేరు విన్పించింది కాబట్టి. ఇక ఇప్పడయితే కాంగ్రెస్ తెలంగాణ జైత్రాయాత్ర సభల్లో జైపాల్ ప్రసంగాలన్నీ తానే ముఖ్యమంత్రిని అయిపోయినట్లున్నాయి.

ఆయన తర్వాత లేటెస్టుగా ఇప్పుడు మర్రి శశిధర్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఈయన కూడా రెండుమూడు రోజులుగా మీడియా ముందు తెగ కన్పిస్తూ, తెలంగాణ కాంగ్రెస్ లో తెగ కలియతిరిగే ప్రయత్నం చేస్తూ హడావిడి చేస్తున్నాడు. అక్కడ అధిష్టానం పెద్దలను కూడా ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇక వీరందరి కంటే మరో ప్రముఖుడు ఉన్నారు. ఎవరెంత గోల చేసినా అందరికంటే సీనియర్, ఆ పదవి ఎప్పుడో రావాల్సిన వాన్ని ఈ సారి అయితే అది తప్పదు అనుకుంటున్న మాజి పిసిసి అద్యక్షుడు డి. శ్రీనివాస్. ఈ మద్య విలేఖరుల సమావేశం పెట్టి టి.ముఖ్యమంత్రి హోదాలో తెగ మాట్లాడేసి సీమాంద్రులను కన్విన్స్ చేసే ప్రయత్నం కూడా చేసారు. ఇంత మందిలో ఎవరు సిఎం అవుతారో అంటే వేచిచూడాలి మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు