చంద్ర‌బాబుకు ఉండ‌వ‌ల్లి టిప్స్‌!

చంద్ర‌బాబుకు ఉండ‌వ‌ల్లి టిప్స్‌!

ఏపీకి ప్ర‌త్యేక హోదా, విభ‌జ‌న హామీల అమ‌లుపై కేంద్రం నిర్ల‌క్ష్య వైఖ‌రికి నిర‌స‌న‌గా ఏపీ ఎంపీలు పార్ల‌మెంటులో కొద్ది రోజులుగా తీవ్ర ఆందోళ‌న‌లు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. కేంద్రంపై వైసీపీ, టీడీపీలు ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానం చ‌ర్చ‌కు రాకుండా పార్ల‌మెంటులోని ఉభ‌య‌స‌భ‌లు వాయిదాప‌డుతూ వ‌స్తోన్న విష‌యం విదిత‌మే. దీనికి తోడు త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం అన్నా డీఎంకే స‌భ్యులు కూడా స‌భా కార్య‌క‌లాపాల‌ను స్తంభింప‌జేయ‌డంతో ఈ స‌మావేశాల్లో `అవిశ్వాసం` చ‌ర్చ‌కు రాక‌పోవ‌చ్చ‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఈ నేప‌థ్యంలో, అవిశ్వాసం, కేంద్రంపై చంద్ర‌బాబు వైఖ‌రిపై మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్ల అరుణ్ కుమార్ త‌న‌దైన శైలిలో స్పందించారు. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌ను ప‌క్క‌కు బెట్టి....కేంద్రంపై చంద్ర‌బాబు పోరాడాల‌ని ఉండ‌వ‌ల్లి సూచించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఉండ‌వ‌ల్ల అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు.

ఏపీ ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రం కోసం కేంద్రం వైఖ‌రికి నిర‌స‌న‌గా పోరాడేందుకు చంద్ర‌బాబు సిద్ధ‌పడ్డార‌ని, అదింకా వేగ‌వంతం  చేయాల‌ని అన్నారు. ఈ పోరాటంలో చంద్ర‌బాబు చురుగ్గా పాల్గొనాల‌ని, ఆయ‌నే ముందుండి నడిపించాలని అవ‌స‌ర‌మైతే కేంద్రంపై న్యాయ పోరాటం చేయాలని ఆయ‌న సూచించారు. ప్రత్యేక హోదాపై సుప్రీంకోర్టు, హైకోర్టులలో రిట్ పిటిషన్లు ఉన్నాయని, వాటికి ఏపీ స‌ర్కార్  కౌంటర్లు దాఖలు చేసేలా చంద్ర‌బాబు చూడాల‌ని కోరారు.

కౌంటర్ దాఖ‌లు చేసేందుకు ఒక్క రోజు చాల‌ని, వెంట‌నే సీఎం ఆ ప‌ని చేయాల‌ని కోరారు.  అవిశ్వాసంపై చర్చ జరిగేలా లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చొరవ తీసుకోవాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న స‌మ‌యంలో త‌న విచక్షణాధికారంతో అప్పటి స్పీకర్ త‌మ‌ను సభ నుంచి సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. అదే త‌ర‌హాలో ప్ర‌స్తుతం స‌భ‌కు ఆటంకం క‌లిగిస్తోన్న అన్నాడీఎంకే సభ్యులను  సస్పెండ్ చేయాలని కోరారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు