గోదావ‌రి జిల్లాల్లో రేవ్ పార్టీల‌ ర‌చ్చ‌ !

గోదావ‌రి జిల్లాల్లో రేవ్ పార్టీల‌ ర‌చ్చ‌ !

అంద‌మైన ప్రకృతికి...స్వచ్ఛమైన పల్లెల జీవన విధానానికి చిరునామా అయిన గోదావ‌రి జిల్లాలో క‌ల‌క‌లం రేగింది. గోదావ‌రి వాసులు క‌ల‌వ‌ర‌పాటుకు గుర‌య్యేలా విష సంస్కృతి పాకింది. సిటీలకే పరిమితమైన రేవ్ పార్టీలు ప్రశాంత పశ్చిమగోదావరి జిల్లాలోను విచ్చలవిడిగా సాగుతోంద‌ని తేలింది. మందుబాబుల హ‌ల్ చ‌ల్‌తో స్థానికంగా క‌ల‌కలం రేగింది. చాగల్లు మండలం కలవలపల్లిలో పచ్చని పంటపొలాల మధ్య జరిగిన రేవ్ పార్టీలపై పోలీసులు దాడి చేయడంతో స్థానికులు అవాక్క‌య్యారు.

పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు మండలం కలవలపల్లిలో గతకొంతకాలంగా రేవ్ పార్టీలు  నిరాటంకంగా జరుగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున పోలీసులకు అందిన సమాచారంతో దాడులు చేశారు. పంటపొలాల మధ్య డిస్కో లైట్లు, మందు చిందులతో పాటు యువతులతో అసభ్యకర నృత్యాలు జరుగుతుండటంతో వారిని అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు.

ఈ రేవ్ పార్టీ లో అశ్లీల నృత్యాలు చేస్తున్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆరుగురు యువతులతో పాటు ఇదే మండలంలోని బ్రాహ్మణగూడెంకు చెందిన ఇద్దరు నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ తో పాటు 4 కార్లు, 1 బైక్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని నిడ‌ద‌వోలు సీఐ తెలిపారు.

అయితే.. ఇక్కడ ఎంజాయ్ చేసేందుకు వచ్చిన మందుబాబులను మాత్రం పోలీసులు అరెస్ట్ చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. దాడి నేపథ్యంలో వారు పరారయ్యారని, నిర్వాహకులను, యువతులను అరెస్ట్ చేశామని నిడదవోలు సీఐ మీడియాకు చెప్పారు. ఓ వైపు సంస్కృతి చెడ‌గొట్టేలా కొంద‌రు ప్రోత్సాహిస్తుంటే శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ విష‌యంలో పోలీసులు ఇలా క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌క‌పోవ‌డం ఏమిట‌ని ఇంకొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు