కొడుకు బాధ గురించి చెప్పిన నీతూఅంబానీ

కొడుకు బాధ గురించి చెప్పిన నీతూఅంబానీ

కొడుకు బాధ గురించి చెప్పిన నీతూఅంబానీదేశంలోనే అప‌ర‌కుబేరుడి కొడుక్కి బాధ‌లు ఉంటాయా?  క‌ష్టాలు ఉంటాయా?  అన్న ప్ర‌శ్న వేయొచ్చు. ఎంత చెట్టుకు అంత గాలి అన్న చందంగా.. మ‌నిషి జీవితంలో కూడా ఎవ‌రికి ఎన్నిక‌ష్టాలు ఉండాలో అన్ని ఉంటాయి. క‌ష్టాల‌న్న‌వి లేనోళ్లు ఎవ‌రూ ఉండ‌రు. కొంత‌మంది క‌ష్టాల్ని క‌ష్టాలుగా చూడ‌రు. వాటిని స‌వాళ్లుగా చూస్తారు. వాటిని అధిగ‌మించాల‌న్న సానుకూల దృక్ఫ‌దంతో ఉంటారు.

అంబానీ కొడుకుగా పుట్టిన త‌ర్వాత బాధ‌ల‌న్న‌వి ఉండ‌వ‌నుకోవ‌టం త‌ప్ప‌న్న మాట తాజాగా నీతూ అంబానీ చెప్పిన మాట వింటే ఇట్టే అర్థ‌మ‌వుతుంది. త‌న కుమారుడు అనంత్ అంబానీ బ‌రువు గురించి నీతూ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని చెప్పారు. కొండ‌లా ఉండే అనంత్ అంబానీ.. ఇప్పుడంటే స‌న్న‌గా మారాడు. ఇందుకోసం అత‌డెంతో క‌ష్ట‌ప‌డిన‌ట్లు విన్నాం. అయితే.. అత‌డి క‌ష్టం గురించి.. అత‌డి వేదన గురించి నీతూ ఎప్పుడూ పంచుకున్న‌ది లేదు.

తాజాగా ఒక కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆమె.. త‌న కొడుకు క్రానిక్ ఆస్త‌మా కార‌ణంగా మందులు తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని.. దీంతో భారీగా బ‌రువు పెరిగార‌న్నారు.

అయితే.. అత‌గాడి బ‌రువు గురించి సోష‌ల్ మీడియాలో వ్యంగ్యంగా వ్యాఖ్య‌లు రాయ‌టంపై అనంత్ విప‌రీతంగా బాధ ప‌డేవాడ‌ని చెప్పారు. ఇది జ‌రిగిన‌ప్పుడు అత‌ని వ‌య‌సు 18 ఏళ్లు అని.. అప్ప‌టి నుంచే వ్యాయామం మొద‌లు పెట్టాడ‌ని.. కొన్ని ప్ర‌త్యేక ప‌రిస్థితులు.. ప్ర‌త్యేక డైట్ ఛార్ట్ తో.. 108 కేజీల బ‌రువును త‌గ్గించుకున్నాడు. ఇందుకోసం భారీగా క‌ష్ట‌ప‌డ్డాడ‌ని ఆమె చెప్పారు.

రోజుకు ఐదారు గంట‌ల పాటు క‌ఠిన‌మైన ఎక్స్ ర్ సైజులు చేసేవాడ‌ని ఆమె చెప్పారు. అనంత్ బ‌రువు త‌గ్గిన త‌ర్వాత అత‌డి ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయ‌ని.. అత‌డ్ని స్ఫూర్తిగా తీసుకొని చాలామంది బ‌రువు త‌గ్గే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని చెప్పారు. నీతూ మాట‌లు విన్నాక‌.. అంబానీ కొడుక్కి కూడా ఎన్ని క‌ష్టాలు ఉంటాయో అర్థ‌మ‌వుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English