రూ.13 కోట్ల కారులో అస‌లేం ఉంటుంది?

రూ.13 కోట్ల కారులో అస‌లేం ఉంటుంది?

దేశంలో అప‌ర‌కుబేరుడు ఎవ‌రు? అన్న ప్ర‌శ్న పూర్తి అయ్యేలోపు ముకేశ్ అంబానీ అన్న మాట వ‌చ్చేస్తుంది. మ‌రి.. అలాంటోడు సైతం.. తాను వాడుతున్నా కారును అర్జెంట్ గా మార్చేయాల‌న్న ఆలోచ‌న తెచ్చే కారు ఒక‌టి మార్కెట్లోకి వ‌చ్చేసింది.

ఎందుకంటే.. ఈ కారు ముందు అంబానీ వాడే కారు చౌక‌గా ఉండ‌ట‌మే కాదు.. అన్ని విష‌యాల్లోనూ త‌క్కువేన‌ని చెబుతున్నారు. ఇంత‌కీ ఈ కారు ఏంది?  దాని ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. ఈ కారు ధ‌ర మన రూపాయిల్లో అక్ష‌రాల రూ.13కోట్లు. చైనాకు చెందిన ఐఏటీ అనే కంపెనీ ఈ ఖ‌రీదైన కార్ల‌ను తొమ్మిదంటే తొమ్మిదిని మాత్ర‌మే త‌యారు చేసింది. మ‌రి.. దీని పేరేమిటంటారా?  కార్ల‌మ‌న్ కింగ్‌. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అంద‌రి దృష్టిని తెగ ఆక‌ర్షిస్తున్న ఈ కారులో విశేషాల‌కు కొద‌వ లేదు.

ఈ స్పెష‌ల్ ఎడిష‌న్ కారుకు మ‌న అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా మార్పులు చేయాలంటే రూ.13 కోట్ల‌కు మ‌రికొంత మొత్తాన్ని అద‌నంగా చెల్లించాల్సిందే. ఇంత‌కీ దాని ప్ర‌త్యేక‌త‌లు ఏమిటి? అంటే.. ఈ కారు బాడీలో క‌ర్వ్ లు అన్న‌వి క‌నిపించ‌వు. తిన్న‌గా.. కోణీయ అకృతిలో కారును డిజైన్ చేశారు. చివ‌ర‌కు ల్యాంప్ లు సైతం కోణీయ ఆకారంలోనే తీర్చిదిద్దారు. హెడ్ ల్యాంప్.. ఫాగ్ ల్యాంపులు కూడా త్రికోణాకృతిలో ఉంటాయి.

రోల్స్ రాయిస్ వాహ‌నాల మాదిరి ఎల్ ఈడీ ల్యాంప్ లు.. టీవీ.. ఫ్రిజ్.. ఎస్ రెసో మెషిన్లు ఉంటాయి. కారు లోప‌లి ఇంటీరియ‌ర్ హోట‌ల్ లాంజ్ ను త‌ల‌పించేలా ఉంటుంద‌ని చెబుతున్నారు. ఎలాంటి వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల్లో ఈ కారును న‌డ‌పొచ్చ‌ని.. మైన‌స్ 40 డిగ్రీల నుంచి 200 డిగ్రీల టెంప‌రేచ‌ర్ లోనూ ఈ కారు జోరుగా దూసుకెళుతుంద‌ని చెబుతున్నారు.

ఇక‌.. ఈ కారు వెడ‌ల్పు 8.2 అడుగులు ఉండ‌నుంది. న‌లుగురు కూర్చునేలా ఈ కారును త‌యారు చేసినా.. దీని వెడ‌ల్పు కార‌ణంగా మామూలు రోడ్ల మీద వెళ్ల‌లేని ప‌రిస్థితి. ఇక‌.. ఈ కారు బ‌రువు ఆరు ట‌న్నులు. ఇంత భారీ బ‌రువు కార‌ణంగా గంట‌కు 140 కిలోమీట‌ర్ల వేగంతో ప్ర‌యాణిస్తుంది. 6.8 లీట‌ర్ల వీ10 ఇంజిన్ తో ఉన్న ఈ కారు వేగం.. మిగిలిన వాటితో పోలిస్తే త‌క్కువే అయినా ద‌ర్జా.. రాజ‌సంలో మాత్రం కిరాకు పుట్టిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు