ఏపీకి గ‌వ‌ర్న‌ర్ గా ఐరెన్ లేడీని తెస్తున్నారా?

ఏపీకి గ‌వ‌ర్న‌ర్ గా ఐరెన్ లేడీని తెస్తున్నారా?

ఏపీలో ఇప్పుడు సాగుతున్న రాజ‌కీయ హ‌డావుడిని మ‌రో రేంజ్ కు తీసుకెళ్లేందుకు మోడీ స‌ర్కారు ఆస‌క్తిక‌ర నిర్ణ‌యం తీసుకుంటుందా? అంటే అవున‌నే మాట‌లు వినిపిస్తున్నాయి.  ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఏపీకి వేరుగా ఒక గ‌వ‌ర్న‌ర్ ను ఏర్పాటు చేయాల‌న్న డిమాండ్ ను ఏపీ బీజేపీ నేత‌లు గ‌డిచిన కొంత‌కాలంగా వినిపిస్తున్నారు. ఉమ్మ‌డి రాష్ట్రంగా ఉన్న నాటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలుగా ఉన్న నేటి వ‌ర‌కూ ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్ గ‌వ‌ర్న‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

న‌ర‌సింహ‌న్ హైద‌రాబాద్‌లోనే ఉండిపోవ‌టం.. కొన్ని ముఖ్య‌మైన కార్య‌క్ర‌మాల సంద‌ర్భంగా విజ‌య‌వాడ‌కు  రావ‌టం.. వెంట‌నే తిరిగి వెళ్ల‌టం తెలిసిందే.

రాష్ట్రానికి పూర్తిస్థాయి గ‌వ‌ర్న‌ర్ ఉండాల‌న్న డిమాండ్ గ‌డిచిన కొంత‌కాలంగా వినిపిస్తోంది. ఏపీకి పూర్తిస్థాయి గ‌వ‌ర్న‌ర్ ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఏపీ బీజేపీ నేత‌లు డిమాండ్ చేయ‌టంతో పాటు ఆ విష‌యాన్ని అధినాయ‌క‌త్వం దృష్టికి తీసుకెళ్లారు.

ఈ నేప‌థ్యంలో ఏపీకి కొత్త గ‌వ‌ర్న‌ర్ ను ఏర్పాటు చేస్తార‌న్న మాట ఆ మ‌ధ్య‌న వినిపించింది. అయితే.. ఇప్ప‌టివ‌రూ ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. ఆ మ‌ధ్య‌న కిర‌ణ్ బేడీని ఏపీకి గ‌వ‌ర్న‌ర్ గా నియ‌మిస్తామ‌న్న మాట వినిపించినా అదిప్ప‌టివ‌ర‌కూ నిజం కాలేదు. ప్ర‌స్తుతం పుదుచ్చేరి లెఫ్టెనెంట్ గ‌వ‌ర్న‌ర్ గా ఉన్న ఆమెను ఏపీకి తీసుకొస్తే బాబు స‌ర్కారుకు స‌రిగ్గా స‌రిపోతార‌ని చెబుతున్నారు.

ఇప్ప‌టికే పుదుచ్చేరిలో అధికార ప‌క్షం కంట్లో న‌లుసులా కిర‌ణ్ బేడీ మారార‌న్న మాట వినిపిస్తోంది. ఇలాంటి వేళ‌.. కిర‌ణ్ బేడీని కానీ పుదుచ్చేరికి తీసుకొస్తే బాగుంటుంద‌న్న అభిప్రాయాన్ని బీజేపీ నేత‌లు వ్య‌క్తం చేస్తున్నారు. కిర‌ణ్ లాంటి ఐరెన్ ఉమెన్ బాధ్య‌త‌లు తీసుకుంటే ఏపీ ప్ర‌భుత్వాన్ని స‌రిగా హ్యాండిల్ చేయ‌గ‌లుగుతామ‌న్న భావ‌న‌లో మోడీ స‌ర్కారు ఉన్న‌ట్లు చెబుతోంది.

ఏపీకి నిధుల విష‌యంలోనూ కేంద్రం.. రాష్ట్రాల మ‌ధ్య పంచాయితీ న‌డుస్తోంది. ఇలాంటి వేళ‌.. అన్ని అంశాల్ని క్షుణ్ణంగా ప‌రిశీలించే అల‌వాటున్న కిర‌ణ్ బేడీ లాంటి వారైతే ఏపీకి స‌రిగ్గా స‌రిపోతార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు