బాబు విశ్వ‌రూపం: మీరు నా మీద చెయ్యికూడా వెయ్య‌లేరు

బాబు విశ్వ‌రూపం: మీరు నా మీద చెయ్యికూడా వెయ్య‌లేరు

వైసీపీ రాజ‌కీయాల‌పై, ఆ పార్టీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డిపై మ‌రోమారు ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అసెంబ్లీలో విరుచుకుప‌డ్డారు. త‌న‌ను జైలుకు పంపేవ‌ర‌కు మోడీని క‌లుస్తుంటాన‌ని చెప్పిన జ‌గ‌న్ స‌న్నిహిత ఎంపీపై మండిప‌డ్డారు. ఏ1 ఏ2 నిందితులకు ప‌విత్ర‌మైన పీఎంవో కార్యాల‌యంలో ఏం ప‌ని అంటూ సీఎం చంద్ర‌బాబు విమ‌ర్శించారు.

అంతేకాదు పీఎం వో చుట్టూ విజ‌య్ సాయిరెడ్డి ఎందుకు ప్ర‌దక్షిణ‌లు చేస్తున్నారని అని అన్నారు. పీఎంవోలో విజ‌య్ సాయి మ‌కాం వెనుక సంకేతాలేంటి అని అనుమానం వ్య‌క్తం చేశారు. ప్రధాని కార్యాలయం చుట్టూ ప్రధాన నిందితులు ప్రదక్షిణలు చేస్తున్నారని, దీని ద్వారా ఏ సంకేతాలు పంపుతున్నారని ప్ర‌శ్నించారు.

ఇదే విష‌యాల‌ను తాను ప్ర‌శ్నిస్తే..జైలుకు పంపిస్తాన‌ని విజ‌య‌సాయి వ్యాఖ్యానించార‌ని, ఇది గ‌ర్హ‌నీయ‌మ‌ని చంద్ర‌బాబు అన్నారు. త‌న‌ను జైలుకు పంప‌డం అసాధ్య‌మ‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. టెక్నిక‌ల్‌గా, చ‌ట్టాన్ని మీరి తాను ఏ త‌ప్పు చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఏదైనా స‌రే, దేనికైనా స‌రే సిద్దంగా ఉన్నాన‌ని అన్నారు. త‌న జీవితం తెరిచిన పుస్త‌క‌మ‌ని వెల్ల‌డించారు.

త‌న‌ను జైలుకు పంపుతాన‌ని ప్ర‌క‌టించిన వ్య‌క్తి పీఎంఓలో తిర‌గాల‌ని అనుకుంటే అలాగే తిరిగే త‌న‌కేమీ అభ్యంత‌రం లేదని చంద్ర‌బాబు అన్నారు. అక్క‌డే కాపురం కూడా చేసుకోండి మాకేం అభ్యంత‌రం అని ఘాటుగా స్పందించారు. అసెంబ్లీ సాక్షిగా బాబు ఈ విష‌య‌మై తేల్చిచెప్పారు.

అవినీతిని ప్ర‌శ్నిస్తే...త‌మ‌పై అదే బుర‌ద చ‌ల్లాల‌నుకుంటే అయ్యే ప‌ని కాద‌ని చంద్ర‌బాబు తెలిపారు. తాము సాంకేతికంగా ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని, వారు ప్ర‌క‌టిస్తున్న‌ట్లు జైలుకు పంప‌డం  అయ్యే ప‌నికాద‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. వైసీపీ తీరును,  వారి బెదిరింపుల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని ఆయ‌న తెలిపారు. రాజ‌కీయాల్లో విబేధించ‌డం స‌హ‌జ‌మ‌ని, రాష్ట్ర ప్ర‌జానికం కోసం విబేధించాన‌ని చంద్ర‌బాబు తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు