ఈ పని తెలుగు ఛానెల్స్ చేస్తేనా..

ఈ పని తెలుగు ఛానెల్స్ చేస్తేనా..

మీడియా.. న్యూస్ చానెల్స్.. ఎంతసేపు వాళ్లకు ఏ న్యూస్ వేస్తే టిఆర్పీ వస్తుంది అనుకుంటారో వాటినే రివైండ్లు రీప్లేలు వేసి మన పైన రుద్దుతారు తప్ప అసలు నిజంగా ప్రేక్షకులకు ఎం కావాలి అనే విషయం తెలుసుకోవాలని ప్రయత్నించరు. కానీ ఆ పని మొట్టమొదటి సారి ఒక న్యూస్ ఛానల్ చేయబోతోంది. అవును మీకెలాంటి కధనాలు కావాలో మాతో చెప్పండి అంటూ ఒక ఛానల్ ముందుకు వచ్చింది.

ఆ ఛానల్ ఎవరో కాదు.. అదే బీబీసీ. బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్. కొద్దీ నెలల క్రితం నుండి ఈ ఛానల్ తెలుగులో కూడా ప్రసారం అవుతోంది. ఆ ఛానల్ మేనేజ్మెంట్ ఈ నెల 26న విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీకి రాబోతోంది. ప్రేక్షకులతో ప్రత్యక్షంగా మాట్లాడటానికి, వారికి ఎలాంటి కధనాలు కావాలో తెలుసుకోవడానికి, వారి ఆలోచనలు పంచుకోడానికి తరలి వస్తోంది. బాగానే ఉంది. మరి మన తెలుగు చానెల్స్ మాత్రం ఎప్పుడు వారికి నచ్చినవి మాత్రమే వేస్తారు.  ఏ న్యూస్ ఛానల్ పెట్టినా.. అయితే శ్రీ రెడ్డి, మాధవి లత లు కాస్టింగ్ కౌచ్ పై చేసిన కామెంట్లు.. లేదంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గురించి డిస్కషన్లు. అవి కూడా దొరకకపోతే కుల హత్యలు, మానభంగాలు, దొంగతనాలు, మతపరమైన కామెంట్లు. రాష్ట్రంలో మనకి తెలియాల్సినవి ఇవి మాత్రమేనా?

స్టూడెంట్స్ ని చేర్చి రామ్ గోపాల్ వర్మ జిఎస్ టి పై డిబేట్లు పెడతారు తప్ప ప్రేక్షకులకు ఎం కావాలి ఎలాంటి వార్తలు చూడాలి అనుకుంటున్నారు అని కనీసం పోలింగ్ అయినా ఎందుకు పెట్టలేకపోతున్నారు? రాష్ట్రంలో క్రియాశీలకమైన పాత్ర పోషించాలి కానీ ఇలా మీగురించి మాకు అక్కర్లేదు మేము చెప్పేదే మీరు చూడాలి అన్నట్టు ఉంటే ఎలా? శ్రీదేవి డెడ్ బాడీ వచ్చేలోపు తొట్లో కూర్చొని కథలు చెప్పడం తేలికే.. కాని నిజంగా సొసైటీని మార్చడమే కష్ఠం. థింక్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు