బీజేపీ టార్గెట్ చంద్రబాబు కాదు, లోకేశ్.. ఎందుకో తెలుసా?

బీజేపీ టార్గెట్ చంద్రబాబు కాదు, లోకేశ్.. ఎందుకో తెలుసా?

టీడీపీ, బీజేపీల మధ్య పొత్తులు తెగిపోయి విమర్శల జోరు పెరిగింది. అంతేకాదు.. రాజకీయంగా కూడా తెలుగుదేశం పార్టీపై రివెంజ్ తీర్చుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని టీడీపీయే ఆరోపిస్తోంది. ఇది ముమ్మాటికీ నిజమని .. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా బీజేపీ చంద్రబాబుపై ఉన్న ఓటుకు నోటు వంటి కేసులను బిగించే ఆలోచనలేదని తెలుస్తోంది. లోకేశ్‌ను చుట్టుముట్టాలన్నది బీజేపీ ప్లానుగా తెలుస్తోంది.

చంద్రబాబుపై కేసులు బిగిస్తే లోకేశ్‌ను ముందు పెట్టి ఎన్నికలకు వెళ్తారు. పైగా అదేమీ బ‌ల‌మైన కేసు కూడా కాదు. దాన్నుంచి బ‌య‌ట‌ప‌డ‌టం చంద్ర‌బాబుకు పెద్ద విష‌యం కూడా కాదు. పైగా పార్టీపై ఇప్ప‌టికే లోకేశ్ ఒక గ్రిప్ రావ‌డంతో కేసుల‌ను ఎదుర్కోవ‌డం బాబుకేమీ ఇబ్బందికాదు, పైగా.. బీజేపీ తన తండ్రిని ఇబ్బంది పెడుతోందన్న సెంటిమెంటు క‌నుక జ‌నాలు గుర్తిస్తే సానుభూతి ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. అదే.. నేరుగా లోకేశ్ పై అవినీతి ముద్ర వేస్తే చంద్రబాబు మానసికంగా బలహీన పడతారని... వీలైనంత తొందరగా లోకేశ్ ను సీఎం చేయాలని తపిస్తున్న చంద్రబాబు డీలా పడతారన్నది బీజేపీ లాజిక్ అని వినిపిస్తోంది .

అంతేకాదు.. తండ్రి కుర్చీని అడ్డంపెట్టుకుని దోచుకున్నారంటూ జగన్ పై చేస్తున్న ఆరోపణలే లోకేశ్ పైనా వస్తే లోకేశ్  తో పాటు చంద్రబాబు ఇమేజ్ కూడా దారుణంగా దెబ్బతినడం ఖాయమని బీజేపీ బలంగా భావిస్తోందని వినిపిస్తోంది. మొత్తానికైతే గత ఎన్నికల్లో తమతో కలిసి నడిచి ఇప్పుడు తమకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తూ... అవిశ్వాసం పేరుతో ఇబ్బంది పెడుతున్న చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో ఏపీలో గెలవకుండా చేయాలని బీజేపీ గట్టిగా అనుకుంటోందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు