న‌న్ను చంపితే పోయేది నాకొడుకు ద‌గ్గ‌రికే!

న‌న్ను చంపితే పోయేది నాకొడుకు ద‌గ్గ‌రికే!

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత ఇటీవ‌లే ఎమ్మెల్యే స‌భ్య‌త్వం నుంచి తొల‌గించబ‌డిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన‌దైన శైలిలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌ను ప‌ద‌వి నుంచి తొల‌గించ‌డంపై మండిప‌డిన కోమ‌టిరెడ్డి ఈ చ‌ర్య‌పై తేల్చుకునేందుకు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని క‌లిసేందుకు ఢిల్లీకి చేరారు.

ఈ సంద‌ర్భంగా త‌న‌దైన శైలిలో ఆయ‌న వ్యాఖ్య‌లు చేశారు. గన్‌మెన్‌లు లేకుండానే ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ ఢిల్లీకి బయల్దేరారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ  అకారణంగానే శాసన సభ్యత్వం రద్దు చేశారన్నారు. శాసన సభ్యత్వం రద్దుకు దాడికి సంబంధం లేదని తెలిపారు.

గవర్నర్‌ ప్రసంగం అడ్డుకున్నందుకే చర్యలు తీసుకున్నామని న్యాయస్థానంలో అడ్వొకేట్‌ జనరల్‌ చెప్పారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.ఇటీవలే అకారణంగా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ భర్తను హత్యచేశారని, కాల్‌డేటాలో వివరాలు బయటపడినా డ‌బ్బుతో లొంగదీసుకున్నారని తెలిపారు. లొంగని వారిని హత్యలు చేయిస్తున్నార‌ని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. త‌న గన్‌మెన్‌లను తొలగించి హత్య చేయాలని కుట్ర పన్నారని విమ‌ర్శించారు.

`నాకు ఏమైనా జరిగితే కేసీఆర్‌దే బాధ్యత అని చెప్పే పిరికిపందను కాదు. ఒక్క వెంకట్‌రెడ్డి చనిపోతే వంద మంది వెంకట్‌రెడ్డిలు వస్తారు. చంపితే నా కొడుకు ద‌గ్గ‌రిని పోతా. కేసీఆర్‌ను గద్దె దింపే వరకు పోరాటం చేస్తా` అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English