బెంగ‌ళూరు టు కొరియాకు ఓలా క్యాబ్ బుక్ చేశాడు

బెంగ‌ళూరు టు కొరియాకు ఓలా క్యాబ్ బుక్ చేశాడు

బెంగ‌ళూరు నుంచి ఉత్త‌రకొరియాకు క్యాబ్‌లో వెళ్ల‌డం సాధ్య‌మా? ఒక‌వేళ వెళితే ఎంత టైం ప‌డుతుంది? అందుకు కిరాయి ఎంత ఉంటుంది? ఇవ‌న్నీ ఆస‌క్తిక‌ర‌మైన సందేహాలు క‌దా? ఇవ‌న్నీ ప‌క్క‌న‌పెడితే..అస‌లు ఇలాంటి జ‌ర్నీ ఉంటుందా అంటారా? ఉంటుంది మరి. వాస్తవిక ప్రపంచంలో కొన్ని సాధ్యంకానివి కూడా ఉంటాయి క‌దా? అలా సాధ్య‌మైందే ఇది! బెంగళూరు నుంచి ఓ విద్యార్థి  ఉత్తరకొరియాకు వెళ్లడానికి క్యాబ్‌ను బుక్ చేసుకున్నాడు. తీరా చూస్తే అక్కడికి వెళ్లేందుకు ఐదు రోజులు పడుతుందని, దానికి ఎంత ఖర్చు అవుతుందనే విషయాన్ని కూడా యాప్ సూచించడంతో విద్యార్థి ఆశ్చర్యానికి లోనయ్యాడు. అసలు జరిగిన కథ తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు

బెంగళూరుకు చెందిన‌ 21ఏళ్ల విద్యార్థి ప్రశాంత్ షాహి శనివారం రాత్రి  ఓలా యాప్‌తో ఓ ప్ర‌యోగం చేశాడు. తన నివాసం నుంచి ఉత్తరకొరియాలోని దక్షిణ ప్యాంగ్యాన్ వెళ్లడానికి తన స్మార్ట్‌ఫోన్‌లోని ఓలా యాప్‌లో ప్రయత్నించగా అక్కడికి కూడా కారులో వెళ్లొచ్చని యాప్ చూపించింది! దీంతో అతడు క్యాబ్‌ బుక్ చేసుకోగా ఐదు రోజుల పాటు 13,840 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుందని.. కిలోమీటరుకు రూ.10ఛార్జి చెల్లించాలని, ప్రయాణానికి రూ.1,49,088 ఛార్జి అవుతుందని యాప్‌లో చూపించింది. అంతేకాదు క్యాబ్‌కు సంబంధించిన డ్రైవర్ వివరాలు, ఓటీపీ, కారు మోడల్‌తో పాటు పూర్తి వివరాల మెసేజ్ రూపంలో రావడంతో విద్యార్థి ఆశ్చర్యపోయాడు.

స‌ర‌దాగా ఈ విరాల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీతో అస‌లేం జ‌రిగింద‌నే చ‌ర్చ వ‌చ్చింది. దీనిపై ప్రశాంత్ స్పందిస్తూ...`ఇటీవ‌లి కాలంలో ఉత్తరకొరియా ట్రెండింగ్‌లో ఉండటాన్ని గమనించాను. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య రోడ్డు కనెక్టివిటీకి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు గూగుల్ మ్యాప్స్‌కు బదులుగా ఓలా యాప్ ఓపెన్ చేశాను. సెర్చింగ్‌కు కావాల్సిన వివరాలన్ని నమోదు చేశాను. అందులో క్యాబ్‌ను బుక్ చేసుకోండని ఆప్షన్ వచ్చింది. అలా రావడంతో అది ఎలా సాధ్యమని నేను ఆశ్చర్యపోయానని పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన స్కీన్‌షాట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఓలా సంస్థ స్పందించింది. అది టెక్నికల్ తప్పిదమని దయచేసి స్మార్ట్‌ఫోన్‌ను రీస్టార్ట్ చేసి మరోసారి ప్రయత్నించండి` అని ట్విటర్‌లో పేర్కొంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు