అక్క‌డ కిలోల్లో ల్యాప్ టాప్ లు అమ్ముతారు

అక్క‌డ కిలోల్లో ల్యాప్ టాప్ లు అమ్ముతారు

మీరు చ‌దివింది నిజ‌మే. ఎలాంటి పొర‌పాటులేదు. మార్కెట్లో ఖ‌రీదైన ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల్లో ల్యాప్ టాప్ ఒక‌టిగా ప‌రిగ‌ణిస్తారు. అలాంటి ల్యాప్ టాప్ ను కిలోల లెక్క‌ల అమ్మే బ‌జార్ దేశంలో ఒక‌టి ఉంది. ఇక్క‌డ ల్యాప్ టాప్ ల‌తో పాటు.. సెల్ ఫోన్ల‌ను కారుచౌక‌గా అమ్మేస్తుంటార‌న్న పేరు ఉంది.

బ‌హిరంగ మార్కెట్లో ఒక్కో ల్యాప్ టాప్ రూ.30 వేలు మొద‌లు రూ.ల‌క్ష వ‌ర‌కు ఉంటాయి. కానీ దేశ రాజ‌ధాని ఢిల్లీలోని నెహ్రూ ప్లేస్ లో ఉన్న మార్కెట్లో ల్యాపీల‌ను కిలోల లెక్క‌న అమ్మేస్తుంటారు. మంచి కండీష‌న్లో ఉన్న ల్యాప్ టాప్ లు రూ.5వేల‌కు కూడా దొరికేస్తుంటాయి. దేశంలోనే అత్యంత చౌకగా ల్యాపీలు దొరికే ప్లేస్ గా నెహ్రూ మార్కెట్‌కు పేరుంది.

అయితే.. ఇక్క‌డ దొరికే ల్యాప్ టాప్ ల కండీష‌న్ ను ఒక‌టికి రెండుసార్లు చెక్ చేసుకున్న త‌ర్వాత కొనుగోలు చేయ‌టం మంచిద‌న్న‌మాట వినిపిస్తుంటుంది. ఫ‌స్ట్ హ్యాండ్ ల్యాపీల‌నే కాదు.. సెకండ్ హ్యాండ్ లాపీల‌ను అమ్ముతుంటారు. వీటితో పాటు సెల్ ఫోన్ల‌ను చౌక‌గా అమ్మేయ‌టం ఈ మార్కెట్ స్పెషాలిటీగా చెప్పొచ్చు. మ‌రి.. ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్లినా.. తెలిసినోళ్లు ఢిల్లీలో ఉన్నా.. ఒక్క‌సారి ఈ నెహ్రూ మార్కెట్ గురించి ఆరా తీస్తే పోలా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు