బాబు అవిశ్వాస తీర్మానంపై హ‌రికృష్ణ రియాక్ష‌న్

బాబు అవిశ్వాస తీర్మానంపై హ‌రికృష్ణ రియాక్ష‌న్

ఎప్ప‌టిక‌ప్పుడు అనూహ్యంగా నిర్ణ‌యాలు తీసుకుంటున్న ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మ‌రోసారి త‌న‌దైన పంథాను ప్ర‌ద‌ర్శించారు. గురువారం రాత్రి వ‌ర‌కూ మోడీపై అవిశ్వాస తీర్మానం పెట్టే జ‌గ‌న్ పార్టీకి మ‌ద్ద‌తు ఇస్తామ‌న్న ఆయ‌న‌.. శుక్ర‌వారం ఉద‌యానికి మాట మార్చేశారు.

జ‌గ‌న్ పార్టీ తీర్మానానికి తాము మ‌ద్ద‌తు ఇస్తే త‌ప్పుడు సంకేతాలు వెళ‌తాయ‌ని.. త‌మ‌కు తామే మోడీ స‌ర్కారుపై అవిశ్వాస తీర్మానాన్ని పెడ‌తామ‌ని వెల్ల‌డించారు. మ‌రోవైపు.. ఎన్డీయేతో తెగ‌తెంపులు చేసుకోనున్న‌ట్లుగా వార్త‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. బాబు తీసుకున్న నిర్ణ‌యంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్న వేళ‌.. బాబు బావ‌మ‌రిది క‌మ్ టీడీపీ సీనియ‌ర్ నేత హ‌రికృష్ణ స్పందించారు. కాసేప‌టి క్రితం మీడియాతో మాట్లాడిన హ‌రికృష్ణ‌.. కేంద్రంపై టీడీపీ పెట్టే అవిశ్వాస తీర్మాన నిర్ణ‌యాన్ని తాను స్వాగ‌తిస్తున్న‌ట్లు చెప్పారు.

తెలుగువారి ఆత్మ‌గౌర‌వ నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశ‌మ‌ని.. త‌మ‌కు రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మ‌న్నారు. ఆంధ్రుల హ‌క్కులు కాపాడే విష‌యంలో రాజీ ప‌డేది లేద‌న్న హ‌రికృష్ణ పార్ల‌మెంటులో టీడీపీ ఎంపీలు రాజీ లేని పోరాటం చేయ‌నున్న‌ట్లు చెప్పారు.

టీడీపీతో ప‌వ‌న్ క‌ల్యాణ్ సంబంధాలు స‌రిగా ఉన్న‌ప్పుడు పెద్ద‌గా రియాక్ట్ కాని హ‌రికృష్ణ.. టీడీపీపై ప‌వ‌న్ విమ‌ర్శ‌లు చేసిన రెండో రోజునే మీడియా ముందుకు రావ‌టం గ‌మ‌నార్హం. చూస్తుంటే.. రానున్న రోజుల్లో జూనియ‌ర్ ఎన్టీఆర్ సైతం సీన్లోకి తీసుకొస్తారా? అన్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు