న‌కిలీ రికార్డుల జాబితాలో రాహుల్ టాప్‌, మోడీ నెక్ట్స్‌

న‌కిలీ రికార్డుల జాబితాలో రాహుల్ టాప్‌, మోడీ నెక్ట్స్‌

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఫ్యాన్స్  అంటే ప్ర‌త్య‌క్షంగా క‌లిసి త‌మ సంఘీభావాన్ని తెలిపేవారు మాత్ర‌మే కాదు క‌దా?  ఆన్ రోడ్‌లో వెంట సాగే వారినే కాకుండా ఆన్‌లైన్‌లో త‌మ‌కున్న ఫాలోవ‌ర్ల‌ను కూడా ఆయా పార్టీల నేత‌లు త‌మ ఫ్యాన్స్ ఖాతాలో వేసేసుకుంటున్నారు. అలా వేసుకున్న ప్రధాని నరేంద్రమోడీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ....తదితర నాయకుల ట్విట్టర్‌ ఖాతా ఫాలోవర్ల‌లో సగానికిపైగా ఫేక్‌ అకౌంట్లే ఉన్నాయని తేలింది. భారతదేశంలో అత్యధిక ట్విట్టర్‌ ఫాలోవర్లు ఉన్న వ్యక్తిగా పాపులారిటీ దక్కించుకున్న ప్రధాని నరేంద్రమోడీ ఖాతాలో 60 శాతం ఫేక్‌ అకౌంట్లేనని 'ట్విట్టర్‌ ఆడిట్‌' బయటపెట్టింది. కాంగ్రెస్ ర‌థ‌సార‌థి రాహుల్‌ గాంధీ ఖాతాలో 69శాతం ఫాలోవర్లు, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఖాతాలో 49 శాతం, ఫేక్‌ అకౌంట్ల నుంచే ఏర్పడ్డాయని తెలిసింది.

ప్రపంచ ప్రముఖల ట్విట్టర్‌ ఖాతాల నిర్వహణపై అధ్యయనం జరిపిన 'డిజిటల్‌ ఏజెన్సీ ట్విప్లోమసీ' అనే సంస్థ పై వివరాల్ని విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌...47 లక్షల ఫాలోవర్స్‌లో 37 శాతం, 16.6 కోట్ల ఫాలోవర్లు ఉన్న పోప్‌ ఫ్రాన్సిస్‌ ఖాతాలో 59 శాతం ఫేక్‌ అకౌంట్ల నుంచి ఏర్పడ్డవేనని తెలిసింది. ప్ర‌ధానిమోడీ ఖాతాలోని 4.1 కోట్ల ఫాలోవర్లలో నిజమైన ఫాలోవర్లు 1.6 కోట్లు మాత్రమేనని తెలిసింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇలా ఫేక్‌ అకౌంట్ల నుంచి ఫాలోవర్లు కలిగినవారు 5వేల మంది ఉన్నారట.  ట్విట్టర్‌ ఆడిట్‌ అనంతరం, మోడీ ఖాతాకు ఫాలోవర్లు...1.6కోట్లు, రెండోస్థానంలో కేజ్రీవాల్‌కి 63 లక్షలు, రాహుల్‌గాంధీకి 17 లక్షలు ఉన్నారని తెలిసింది. ఇంతపెద్ద సంఖ్యలో వారిని అనుసరిస్తున్నారా ? అంటే ? కాదు అనే సమాధానమే వస్తుంది. దేశవిదేశాల్లోని ప్రఖ్యాత రాజకీయ నాయకులు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటుచేసుకొని పాపులారిటీని పెంచుకుంటున్నారు. ఆ సిబ్బంది పూర్తి స్థాయి ఉద్యోగులుగా పనిచేస్తూ, అదేపనిగా సామాజిక మాధ్యమంలో నాయకుల పాపులారిటీ పెంచుతున్నారు. అంటే నిజమైన ఫాలోవర్లలో కూడా కృత్రిమమైనవే అత్యధికమున్నాయని తెలుస్తోంది.అ ఫేక్‌ అకౌంట్లలో 99శాతం ఎలాంటి సందేశాలూ లేవు. కొన్ని గుర్తులు, సంజ్ఞలు...ఎమ్మోజీలు మాత్రమే ఉన్నాయి.

అ ఫిబ్రవరి 21నాటికి మోడీ ట్విట్టర్‌ ఫాలోవర్ల సంఖ్య 4కోట్లా 3 లక్షలు. కేవలం 20 రోజుల తర్వాత ఆయన ఖాతాకు కొత్తగా 7 లక్షల ఫాలోవర్లు చేరారు. కొద్ది రోజుల వ్యవధిలో ఇలా ఫాలోవర్లు పెరగటానికి కారణం 'ఫేక్‌' అకౌంట్లేనని ట్విట్టర్‌ ఆడిట్‌ తేల్చింది. కాగా, 'ఆటోమేటెడ్‌ అప్లికేషన్‌'తో నడిచే ఖాతాలు, ఇమిటేటింగ్‌ ఖాతాలు, యాక్టీవ్‌లో లేనివి, సిబ్బంది సృష్టించే ఫాలోవర్సు...వీటిని కూడా మినహాయించగలిగితే, ప్ర‌ముఖుల‌ను ట్విట్టర్‌లో అనుసరించే సంఖ్య ఇంకా తగ్గుతుందని స్ప‌ష్టం చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English