యూపీఏ, వైసీపీ అధికారంలో ఉంటే న‌న్ను చంపేసేవారు: ప‌వ‌న్

యూపీఏ, వైసీపీ అధికారంలో ఉంటే న‌న్ను చంపేసేవారు: ప‌వ‌న్

గుంటూరులో జ‌రిగిన జ‌న‌సేన ఆవిర్భావ దినోత్స‌వ స‌భ‌లో బీజేపీ, టీడీపీ ప్ర‌భుత్వాల‌పై ప‌వ‌న్ పూర్తిస్థాయిలో తిరుగుబాటు బావుటా ఎగ‌ర‌వేసిన సంగ‌తి తెలిసిందే. రాష్ట్రంలో టీడీపీ హ‌యాలంలో అవినీతి పెరిగిపోయింద‌ని, సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్ ను ఉద్దేశించి ప‌వ‌న్ నేరుగా ఘాటు వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం రేపాయి. కేవ‌లం రాష్ట్రాభివృద్ధి కోసమే టీడీపీకి మ‌ద్ద‌తిచ్చాన‌ని, తాను ఏ ఒక్క ప‌ద‌వినీ ఆశించ‌లేద‌ని, ఎవ‌రికీ ప‌ద‌వి ఇవ్వాల‌ని కోర‌లేద‌ని ప‌వ‌న్ అన్నారు. కానీ, టీడీపీ అవినీతి రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతోంద‌ని, గ‌డ‌చిన నాలుగేళ్లలో ఆ పార్టీ మాట్లాడిన మూడు మాటల్లో ఆరు అబద్ధాలు వినిపిస్తున్నాయ‌ని దుయ్య‌బ‌ట్టారు. టీడీపీ ప్రభుత్వం ఈ స్థాయికి దిగ‌జారి అవినీతి , అరాచ‌కాల‌కు పాల్ప‌డుతుండ‌డం త‌న‌కు ఎంతో బాధ క‌లిగిస్తోంద‌న్నారు. ఏపీలో ద‌ళితులపై దాడులు జ‌రుగుతున్నా చంద్ర‌బాబు స‌ర్కార్ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, తాను ఏపీ అభివృద్ధికి సామాజిక వర్గాల మధ్య ఐక్యతను కోరుకుని టీడీపీకి మ‌ద్ద‌తునిచ్చాన‌న్నారు.


ఏపీలో టీడీపీ అవినీతిని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం అయిన వైసీసీ నేతలు ప్ర‌శ్నిస్తార‌ని, ప్ర‌భుత్వంపై పోరాడుతార‌ని తాను అనుకున్నాన‌ని, కానీ, వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించార‌ని ప‌వ‌న్ అన్నారు. జగన్‌ సీఎం అయితేనే అసెంబ్లీకి వెళ్తారా అని నిల‌దీశారు. తాను సీఎంను కాద‌ని, ప్ర‌శ్నించ‌డానికి సీఎం కాన‌వ‌స‌రం లేద‌ని జ‌గ‌న్ ను ఉద్దేశించి వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటేనే ఈ ప‌రిస్థితి ఉంద‌ని, ఒకవేళ రాష్ట్రంలో వైసీపీ, కేంద్రంలో యూపీఏ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి ఉంటే ప‌రిస్థితులు దారుణంగా ఉండేవేమో అని ప‌వ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. వైసీపీ, యూపీఏలు అధికారంలో ఉండి ఉంటే త‌న‌పై దాడులు జ‌రిగి ఉండేవ‌ని, త‌న‌ను చంపేసేవారేమోన‌ని ప‌వ‌న్ న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. తాను కేవలం న‌వ్యాంధ్ర పునర్నిర్మాణం కోసం టీడీపీకి  మద్దతిచ్చాన‌ని, ఆ పార్టీ పునర్నిర్మాణానికి త‌న‌కూ ఎలాంటి సంబంధం లేద‌ని ప‌వ‌న్ అన్నారు. చంద్ర‌బాబును కలిసినప్పుడు రాజధాని నిర్మాణానికి 1500 -2000 ఎకరాల భూమి స‌రిపోతుంద‌న్నార‌ని , కానీ ఏకంగా 33 వేల ఎకరాలు సేక‌రించార‌ని దుయ్య‌బ‌ట్టారు. కేవలం రాజధాని చుట్టూ అభివృద్ధి కేంద్రీకృతం కావ‌డం స‌రికాద‌ని, రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర‌, ప్ర‌కాశం ప్రాంతాల‌పై కూడా ప్ర‌భుత్వం దృష్టిపెట్టాల‌న్నారు. కేంద్రంతో రాత్రికి రాత్రే చంద్ర‌బాబు చీకటి ఒప్పందాలు చేసుకొని ప్యాకేజీకి అంగీక‌రించార‌ని మండిప‌డ్డారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English