జ‌న‌సేన స‌భ వ‌ద్ద ఉద్రిక్త‌త‌...సీఎం ప‌వ‌న్ నినాదాలు..

జ‌న‌సేన స‌భ వ‌ద్ద ఉద్రిక్త‌త‌...సీఎం ప‌వ‌న్ నినాదాలు..

జ‌న‌సేన‌ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గుంటూరు నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఉన్న మైదానంలో నిర్వహిస్తున్న జనసేన ఆవిర్భావ సభలో ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. ఈ స‌భ‌లో తొక్కిసలాట జ‌రిగింది. కార్యకర్తలు అదుపు తప్పడంతో 100మందికి పైగా గాయాలు అయ్యాయి.  ఐదుగురు కార్యకర్తలు సొమ్మసిల్లారు. ఇద్దరు పోలీసులకు గాయాలు అయ్యాయి. జ‌న‌సేన పార్టీ కార్యకర్తలు, ప‌వ‌న్ అభిమానులు బారికేడ్లను ధ్వంసం చేస్తూ సీఎం ప‌వ‌న్ అంటూ వేదిక వైపు దూసుకుపోయే ప్ర‌య‌త్నం చేశారు. అభిమానులు, కార్యకర్తలు మహిళల గ్యాలరీలోకి దూసుకెళ్తుండ‌టంతో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది.

పోలీసులు ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ అభిమానులను స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో ప‌రిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో కార్యకర్తలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు. మీడియా వాహనాలవైపు కార్యకర్తలు దాడి చేశారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన వేదిక వద్దకు జనసేన కార్యకర్తలు దూసుకు రావ‌డంతో ఈ ప‌రిణామం చోటుచేసుకున్న‌ట్లు స‌మాచారం. సుమారు నాలుగు లక్షల మంది ఈ సభకు వస్తారన్న అంచనా వ్యక్తమవుతున్నందున, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణుల‌ను ప‌వ‌న్ ఆదేశించారు. అయితే అభిమానులు సంయ‌మ‌నం కోల్పోవ‌డంతో ఈ ప‌రిణామం చోటుచేసుకుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English