హైద‌రాబాద్‌లో ఏపీ చివ‌రి ఆన‌వాళ్లు కూడా చెరిగిపోయింది

హైద‌రాబాద్‌లో ఏపీ చివ‌రి ఆన‌వాళ్లు కూడా చెరిగిపోయింది

తెలుగు రాష్ర్టాల ప‌దేళ్ల ఉమ్మ‌డి రాజ‌ధాని హైదరాబాద్ విష‌యంలో ఏపీ వాసులు త‌మ జ్ఞాప‌కాల‌ను వ‌దిలేసుకోవాల్సి వ‌చ్చేట‌ట్లుంది. ఇప్ప‌టికే ప‌రిపాల‌న మొత్తం ఏపీ కేంద్రంగా సాగుతుండ‌గా...ఏపీకి చెందిన కొన్ని భ‌వ‌నాలు మాత్ర‌మే మిగిలి ఉన్నాయి. హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, శాసనమండలి భవనాలను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, శాసనమండలి సమావేశాలు అమరావతిలో జరుగుతున్నందున ఇక్కడి అవసరాల మేరకు ఆ రాష్ట్ర భవనాలను కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ విజ్ఞప్తిపైన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాల శాసనమండలి ఛైర్మన్లు, ప్రభుత్వ పెద్దలు చర్చలు జరిపి భవనాల అప్పగింతకు సంబంధించి అంగీకారం కుదుర్చుకున్నారు. అప్పగింతల ప్రక్రియ పూర్తి కావడంతో ఏపీకు కేటాయించిన అసెంబ్లీ, మండలి భవనాల మరమ్మత్తులను తెలంగాణ ప్రభుత్వ అధికారులు చేపట్టారు. సమావేశ మందిరం, గదులకు తెలంగాణ అవసరాల మేరకు మెరుగులు దిద్దుతున్నారు. ఏపీ బోర్డులను తొలగించి తెలంగాణ బోర్డులను ఏర్పాటు చేశారు. మండటి ఛైర్మన్‌, డిప్యూటీ ఛైర్మన్‌, ముఖ్యమంత్రి ఛాంబర్లకు మరమ్మత్తులు కొనసాగుతున్నాయి. ఏపీ శాసనమండలి సమావేశ మందిరాన్ని తెలంగాణ శాసనమండలి సమావేశాలకు వినియోగించుకుంటే, జూబ్లీహాల్‌ను తిరిగి పాత తనహాలోనే అధికారిక సమావేశాలకు, సదస్సులకు వినియోగించుకొనే వెసులుబాటు కలుగుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English