ఆమెకి ఎంతమందితో లింకెడతారో?

ఆమెకి ఎంతమందితో లింకెడతారో?

ఫిలిం ఇండస్ట్రీలో రూమర్స్ చాలా సహజం. చాలామంది సెలబ్రిటీలు వాటిని పట్టించుకోరు. ఒకే రూమర్ మళ్లీ మళ్లీ వినిపిస్తే మాత్రం దాన్ని కంట్రోల్ చేసే ఉద్దేశ్యంతో ఖండిస్తూ ఉంటారు. ఇప్పటివరకూ ఇలాంటి ఉదంతాలు చాలానే ఉన్నాయి. కానీ ఓ హీరోయిన్ విషయంలో మాత్రం వదంతులు మరీ ఎక్కువవుతున్నాయి.

ఒక పరభాషా హీరోయిన్ మన దగ్గర క్రేజీ హీరోయిన్ గా ఎదిగింది. ఇంకా స్టార్స్ సినిమాలు అందుకునే రేంజ్ రాలేదు కానీ.. కుర్ర హీరోలకు మాత్రం ఈమెనే మొదటి ఛాయిస్. అందం ట్యాలెంట్ రెండూ ఉన్న ఈ భామను.. వరుసగా కుర్ర హీరోలతో లింక్ చేస్తూ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఓ శక్తివంతుడైన హీరోతో సినిమా చేస్తోంది. గతంలో వీళ్లిద్దరూ కలిసి చేసిన మూవీ అటకెక్కేసినా.. మళ్లీ ఆమే కావాలని కోరుకుని.. ఆమెను ఒప్పించి మరీ మూవీ చేస్తున్నాడా హీరో

వీళ్లిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ మరీ ఎక్కువయిపోతోంనే టాక్ విపరీతంగా వినిపిస్తోంది. కానీ గతంలో ఈమె మరో క్రేజీ యంగ్ హీరోతో మూవీ చేసినపుడు కూడా ఇలాగే న్యూస్ వచ్చింది. అప్పుడా హీరో.. ఇప్పుడీ హీరో.. మిగతా కథంతా సేమ్ టు సేమ్. అయినా ఒకట్రెండు సినిమాల్లో కలిసి నటించినంత మాత్రాన ఇలా లింకెట్టేస్తే ఎలా చెప్పండి. ఓ హీరోయిన్ కనీసం 20కి పైగా హీరోలతో నటిస్తే అందరితోనూ లింకులెట్టేస్తే ఎలా చెప్పండి?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English