సోనియమ్మ విందు ఫోన్ కాల్ తాజాగా ఎవ‌రికంటే?

సోనియమ్మ విందు ఫోన్ కాల్ తాజాగా ఎవ‌రికంటే?

మాట్లాడుకోవటానికి ర‌మ్మ‌న‌టం బాగోదు. అదే.. విందు ఏర్పాటు చేసి పిలిస్తే?  పిలిచే వారికి ఇబ్బంది ఉండ‌దు.. వ‌చ్చే వారికి అభ్యంత‌రం ఉండ‌దు. అందుకు.. కొన్నిసార్లు విందు స‌మావేశాలు రాజ‌కీయాల్లో కీ రోల్ ప్లే చేస్తుంటాయి. ఇలాంటివాటితో ఎంత‌టి ప్ర‌యోజ‌న‌మ‌న్న విష‌యాన్ని సోనియాగాంధీ లాంటి నేత‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దు.  ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో జాతీయ స్థాయిలో స‌రికొత్త కూట‌మిని ఏర్పాటు చేసేందుకు.. భ‌విష్య‌త్ రాజ‌కీయాల కోసం ముంద‌స్తుగా విందు స‌మావేశాన్ని నిర్వ‌హిస్తున్నారు.

ఇప్ప‌టికే ఈ విందుకు రావాలంటూ తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో స‌హా ప‌లువురిని ఆహ్వానించారు. తాజాగా త‌మిళ‌నాడు విప‌క్ష‌మైన డీఎంకే కార్యాచ‌ర‌ణ అధ్య‌క్షుడు స్టాలిన్ ను పిలిచారు. తాజాగా ఫోన్ చేసిన ఆమె.. ఈ నెల 13న విందును ఢిల్లీలో ఏర్పాటు చేశారు. తాను ఇస్తున్న విందున‌కు రావాలంటూ ఆమె స్వ‌యంగా ఫోన్ కాల్ చేసి ఆహ్వానించారు. సోనియ‌మ్మ రాజ‌కీయ విందు ఇప్ప‌టికే క‌ల‌క‌లం రేపుతున్న వేళ‌.. ఈ స‌మావేశం ఎలా జ‌రుగుతుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English