మోడీ మీద‌కు ఆ న‌టుడ్ని మిస్సైల్ మాదిరి వ‌ద‌ల‌నున్నారా?

మోడీ మీద‌కు ఆ న‌టుడ్ని మిస్సైల్ మాదిరి వ‌ద‌ల‌నున్నారా?

ప్ర‌ధాని మోడీని టార్గెట్ చేసి.. లాజిక్ పోస్టుల‌తో ఆయ‌న్ను ఏసుకునే విల‌క్ష‌న న‌టుడికి కాంగ్రెస్ పార్టీ ప్ర‌మోష‌న్ ఇవ్వ‌నుందా? అన్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏ పార్టీకి ప్రాతినిధ్యం వ‌హించ‌కుండా.. రాజ‌కీయాల‌పైనా.. ముఖ్యంగా మోడీ అంటే మండిప‌డే ప్రకాశ్ రాజ్ లాంటి న‌టుడ్ని రాజ్య‌స‌భ‌కు పంపితే పార్టీకి ప్ర‌యోజ‌నంగా మార‌ట‌మే కాదు.. త్వ‌ర‌లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు లాభం చేకూరుతుంద‌న్న అభిప్రాయం క‌ర్ణాట‌క కాంగ్రెస్ చేస్తుంద‌ని చెబుతున్నారు.

ఇటీవ‌ల బెంగ‌ళూరులో జ‌రిగిన ప్ర‌ధాని మోడీ ర్యాలీపై సెటైర్లు వేయ‌ట‌మే కాదు.. ప‌లు సంద‌ర్భాల్లో మోడీ స‌ర్కారుకు చుర‌క‌లేస్తూ ఆయ‌న సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. మోడీపై సైద్ధాంతికంగా పోరు చేసే ప్ర‌కాశ్ రాజ్ లాంటి గ్లామ‌ర్ సినీ స్టార్‌కు రాజ్య‌స‌భ సీటు క‌ట్టబెట్టాల‌న్న ప్ర‌తిపాద‌న‌ను కర్ణాట‌క ముఖ్య‌మంత్రి సిద్ధ చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

మ‌రి.. ఆయ‌న మాట‌కు కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం ఎలా రియాక్ట్ అవుతుంద‌న్న‌ది ఇప్ప‌డు ప్ర‌శ్న‌గా మారింది. వామ‌ప‌క్షాల పోరాటంలో చొర‌వ‌తో దూసుకెళ్లే ప్ర‌కాశ్ రాజ్ లాంటి సినీ న‌టుడికి రాజ్య‌స‌భ టికెట్ ఇస్తే..కాంగ్రెస్‌కు ప్ర‌యోజ‌నంగా మారుతుంద‌న్న చ‌ర్చ ఆ పార్టీలో న‌డుస్తోంది. మ‌రి.. దీనిపై పార్టీ నిర్ణ‌యం ఎలా ఉంటుంద‌న్న‌ది  ఒక ప్ర‌శ్న అయితే.. పెద్ద‌ల స‌భ‌కు పంపుతామంటూ కాంగ్రెస్ కోరితే అందుకు ప్ర‌కాశ్ రాజ్ స‌మ్మ‌తిస్తారా? అన్న‌ది కూడా సందేహంగా చెబుతున్నారు. ఏమైనా.. రాజ్య‌స‌భ‌కు ప్ర‌కాశ్ రాజ్ వెళితే మాత్రం.. స‌భ‌లో అధికార‌ప‌క్షానికి చుర‌క‌లు ఎక్కువ కావ‌టం ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English