ప‌నికి పిలిచార‌ని వెళితే.. ప‌ద‌వి వ‌చ్చింది

ప‌నికి పిలిచార‌ని వెళితే.. ప‌ద‌వి వ‌చ్చింది

ఏపీ రాజ్య‌స‌భ ఎన్నిక‌లకు అభ్య‌ర్థుల ఎంపిక విష‌యంలో నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యేల బ‌లం ప్రకారం చూస్తే.. ఏపీ అధికార‌ప‌క్షానికి రెండు.. విప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఒక్క స్థానం ల‌భించింది. జ‌గ‌న్ పార్టీకి సంబంధించి ఇప్ప‌టికే అభ్య‌ర్థిని ప్ర‌క‌టించిన‌నేప‌థ్యంలో ఆ విష‌యంలో ఎలాంటి క‌న్ఫ్యూజ‌న్ లేదు.

కానీ.. ఏపీ అధికార‌ప‌క్షం టీడీపీలోనే అంతా గంద‌ర‌గోళంగా ఉంద‌ని చెప్పాలి. రాజ్య‌స‌భ సీటును ఆశించిన తెలుగు త‌మ్ముళ్ల జాబితా పెద్ద‌దిగా ఉంది. త‌న‌కు అత్యంత స‌న్నిహితుడు.. త‌న వ్య‌వ‌హారాల్ని చ‌క్క‌బెడ‌తార‌న్న పేరున్న సీఎం ర‌మేశ్ కు మ‌రోసారి రాజ్య‌స‌భ సీటును క‌న్ఫ‌ర్మ్ చేయ‌టం ఎవ‌రికి ప్ర‌త్యేక ఆశ్చ‌ర్యానికి గురి చేయ‌లేదు. అదే స‌మ‌యంలో రెండో సీటు కోసం క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌కుమార్ ను ఎంపిక చేయటం మాత్రం ఆస‌క్తిక‌రంగా మారింది. 
ఆ మాట‌కు వ‌స్తే.. తాను రాజ్య‌స‌భ సీటుకు అభ్య‌ర్థిని అవుతాన‌ని క‌న‌క‌మేడ‌ల‌కు కూడా తెలీద‌ని చెబుతున్నారు. దీనికి కార‌ణం లేక‌పోలేదు. 1996 నుంచి టీడీపీ న్యాయ విభాగంలో ఉన్న ఆయ‌నకు సివిల్‌.. క్రిమిన‌ల్ కేసుల‌తో పాటు రాజ్యాంగ ప‌ర‌మైన వివాదాలు.. ఎన్నిక‌లకు సంబంధించిన అంశాల‌కు సంబంధించిన కేసుల్లో బ‌ల‌మైన వాద‌న‌లు వినిపిస్తార‌ని.. విష‌యం ఉన్న వ్య‌క్తిగా చెబుతుంటారు.

టీడీపీ న్యాయ విభాగంలో విధులు నిర్వ‌ర్తించే ఆయ‌న్ను.. ప్ర‌తి ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ పిలుస్తుంటారు. అభ్య‌ర్థుల పత్రాలు.. వారికి నామినేష‌న్ పేప‌ర్ల‌ను ప‌రిశీలించ‌టం.. న్యాయ‌ప‌ర‌మైన ఎలాంటి చిక్కుముడులు లేవ‌న్న క్లియ‌రెన్స్ ను ఇచ్చిన త‌ర్వాత ప్రాసెస్ మ‌రింత ముందుకు వెళుతుంది. ఇది ఇప్పుడు కాదు.. కొన్ని ద‌శాబ్దాలుగా సాగుతున్న ఎపిసోడ్‌. తాజాగా అదే రీతిలో త‌న‌ను పిలిచార‌ని క‌న‌క‌మేడ‌ల భావించారు. రాజ్య‌స‌భ ఎన్నిక‌ల ఆభ్య‌ర్థుల వివ‌రాల్ని చెక్ చేయ‌టం కోసం పార్టీ ఆఫీసుకు వెళ్లిన ఆయ‌నకు రాజ్య‌స‌భ సీటును క‌న్ఫ‌ర్మ్ చేసిన‌ట్లు చెప్ప‌టంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

కృష్ణా జిల్లా అవ‌నిగ‌డ్డ‌కు చెందిన క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌కుమార్ 1956 ఆగ‌స్టు 8న జ‌న్మించారు. విజ‌య‌వాడ సిద్ధార్థా కాలేజీలో డిగ్రీ చేసిన త‌ర్వాత నాగార్జున వ‌ర్సిటీలో లా పూర్తి చేశారు. 1998 వ‌ర‌కు బెజ‌వాడ‌లో ప్రాక్టీస్ చేసిన ఆయ‌న‌.. ఆ త‌ర్వాత హైకోర్టుకు షిఫ్ట్ అయ్యారు. ఇదిలా ఉంటే 1996 నుంచి టీడీపీ న్యాయ విభాగంలో ప‌ని చేస్తున్నారు. ఇటీవ‌ల ఆ విభాగం అధ్య‌క్షులుగా ఎంపిక‌య్యారు.

క‌న‌క‌మేడ‌ల అభ్య‌ర్థిత్వాన్ని ప్ర‌క‌టించ‌టానికి ముందు వ‌ర‌కు చాలానే పేర్లు వినిపించాయి. బ‌లంగా వినిపించిన పేర్ల‌లో వ‌ర్ల రామ‌య్య ఒక‌రు. ఆ మాట‌కు వ‌స్తే.. రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం త‌న‌దేన‌ని ఆయ‌న అనుకున్నారు కూడా. ఆఖ‌రి నిమిషంలో క‌న‌క‌మేడ‌ల పేరు వినిపించినా.. ఫైన‌ల్ కు రాద‌న్న భావ‌న వ్య‌క్త‌మైంది. అయితే.. ఇప్పుడున్న హోదా పేజీతోపాటు.. విభ‌జ‌న చ‌ట్టం అమ‌లుకు సంబంధించి ఉన్న చిక్కుముడులు.. న్యాయ‌ప‌ర‌మైన అంశాల్ని రాజ్య‌స‌భ‌లో బ‌లంగా వినిపించేందుకు క‌న‌క‌మేడ‌ల స‌రైన అభ్య‌ర్థిగా బాబు భావించారు. అదే ఆయ‌న‌కు ప‌ద‌వి వ‌చ్చేలా చేసింద‌ని చెబుతున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. క‌న‌క‌మేడ‌ల అదృష్టాన్ని అర‌చేతిలో పెట్టుకొని తిరిగే ర‌కం కాదు. పార్టీకి ఎన్నో ఏళ్లుగా సేవ‌లు చేస్తున్నా.. స‌రైన ప‌ద‌వి ఒక్క‌సారి కూడా ద‌క్క‌లేదు. రెండుసార్లు ఎమ్మెల్సీ ప‌ద‌వి ప‌క్కా అని చెప్పి.. చివ‌ర్లో కాంబినేష‌న్ కుద‌ర‌క ఆయ‌న‌కు హ్యాండిచ్చిన ప‌రిస్థితి. అలాంటి వేళ‌లో కూడా నిరాశ చెంద‌కుండా.. అసంతృప్తిని గుండెల్లోనే దాచుకున్నారే త‌ప్పించి పెద‌వి దాట‌లేదు. ఈ విధేయ‌త కూడా తాజాగా ఆయ‌నకు ప‌ద‌వి ఇవ్వ‌టానికి కార‌ణ‌మైంద‌ని చెబుతున్నారు. క‌న‌క‌మేడ‌ల అభ్య‌ర్థిత్వాన్ని ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు.. వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌టంతో పాటు.. క‌ష్ట‌ప‌డి ప‌ని చేసిన వారికి  పార్టీలో ఎప్ప‌టికైనా ప‌ద‌వులు అన్న సందేశాన్ని పంపిన‌ట్లైంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English