పీకేతో రాహుల్ గాంధీ భేటి.. మ్యాటరేంటి..?

జాతీయ రాజకీయాల్లో నేడు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్… కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటలపాటు.. వీరు సమావేశం కావడం గమనార్హం.

కొద్ది రోజుల క్రితం..ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ తో వ‌రుస‌గా భేటీ అవుతున్నారు పీకే. పీకేతో స‌మావేశం త‌ర్వాత శ‌ర‌ద్ పవార్ బీజేపీయేత‌ర ప‌క్షాల‌తో స‌మావేశం అయ్యారు. ఆ స‌మావేశం త‌ర్వాత ప‌వార్-పీకే మ‌ళ్లీ భేటీ అయ్యారు. ఇప్పుడు పీకే రాహుల్, ప్రియాంక‌ల‌ను క‌ల‌వ‌టం రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ప్ర‌తిప‌క్షాల ఉమ్మ‌డి రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ప‌వార్ ను నిల‌బెట్టేందుకేనా… మ‌రేదైనా ఉందా అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మ‌రోవైపు పంజాబ్ ఎన్నిక‌లు స‌మీపిస్తున్నాయి. అక్క‌డ సీఎం అమ‌రీంద‌ర్ సింగ్, న‌వ‌జ్యోత్ సింగ్ సిద్దూ మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే మండుతోంది. దీంతో పంజాబ్ లో అధికారాన్ని నిల‌బెట్టుకునేందుకు పీకే కాంగ్రెస్ కు ప‌నిచేసే అవ‌కాశం ఉన్న‌ట్లు కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ మీటింగ్ కు కీల‌క నేత కేసీ వేణుగోపాల్ కూడా హ‌జ‌రైన‌ట్లు తెలుస్తోంది.