2019: తెలంగాణ‌ ముఖ్య‌మంత్రి కేటీఆరే !

2019: తెలంగాణ‌ ముఖ్య‌మంత్రి  కేటీఆరే  !

ఎవ‌రైనా ప్ర‌క‌టించారా?
ఎవ‌రైనా డిమాండ్ చేశారా?
కేసీఆర్ ఏమైనా చెప్పాడా?
పైన శీర్షిక చూసిన వెంట‌నే మీ మ‌దిలో మెదిలిన ప్ర‌శ్నలివి. యస్‌... కేసీఆర్ ప్ర‌క‌టించాడు. కాక‌పోతే కేటీఆర్ సీఎం అవుతాడ‌ని తన నోటితో తాను చెప్ప‌లేదు కానీ... ఈరోజు జ‌రిగిన స‌మావేశంలో 2019 వ‌ర‌కే తాను రాష్ట్ర రాజ‌కీయాల్లో ఉంటున్న‌ట్లు చాలా స్ప‌ష్టంగా చెప్పారు. మ‌రి అత‌ను రాష్ట్ర రాజకీయాల‌ను వ‌దిలేస్తే వార‌సుడు... ఇక కేటీఆర్ కాక మ‌రెవ్వరు? ఇంకో ఛాయిసే లేదు.

ఎందుకంటే... ఇప్ప‌టికే కేసీఆర్ మాటే వేద‌మ‌ని హ‌రీష్ రావు విస్ప‌ష్టంగా చెప్పాడు. కొడుకు రూట్ క్లియ‌ర్ చేయ‌డం కోసం, త‌న జాతీయ అజెండా అమ‌లు చేయ‌డం కోసం .. ఇలా రెండు విధాలుగా వీలు హ‌రీష్ త‌న ప‌క్క‌నుండాల్సిన‌ అవ‌స‌రం కేసీఆర్‌కు ఉండ‌నుంది. ఈ నేప‌థ్యంలో... ఇక తెలంగాణ‌కు ఫ‌స్ట్ ఛాయిస్ ఏ విధంగా చూసినా కేటీ రామారావే అవుతాడు.

ఈ రోజు జ‌రిగిన  తెరాస శాసనసభా పక్ష సమావేశంలో *తాను తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో 2019 వరకూ ఉంటానని* ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. 2019 తర్వాత జాతీయంగా రాజకీయాల్లో వెళ్లి... భార‌త‌దేశం అభివృద్ధిలో గుణాత్మక మార్పు కోసం అడుగులు వేసే ప్రయత్నం చేస్తానని వివ‌రించారు. కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్య‌ల‌కు శాస‌న‌స‌భ్యుల నుంచి భారీ స్పంద‌న వ‌చ్చింది. దేశ రాజ‌కీయాలు భార‌త‌దేశ పురోభివృద్ధికి ఉప‌యోగ‌ప‌డటం లేదని, ప్రాంతీయ అస‌మాన‌త‌లు స‌రిదిద్దే ప్ర‌య‌త్నాలు కూడా స‌రిగా జ‌ర‌గ‌డం లేద‌న్నారు.

రాష్ట్రాల హ‌క్కులు కాల‌రాయ‌డం స‌రికాద‌ని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అయితే, కొంద‌రు కేసీఆర్ ది థ‌ర్డ్ ఫ్రంట్‌, ఇంత‌వ‌ర‌కు థ‌ర్డ్ ఫ్రంట్ అడుగులు ముందుకు ప‌డిన దాఖ‌లాలు లేవు కాబ‌ట్టి... కేసీఆర్ త‌న ప్ర‌య‌త్నం మానుకోవ‌డం మంచిద‌ని వ‌స్తున్న వ్యాఖ్య‌ల‌కు కేసీఆర్ బ‌ల‌మైన కౌంట‌ర్ వేశారు. *మనది థర్డ్‌ ఫ్రంట్ కాదు..  ఫస్ట్‌ ఫ్రంట్‌* అని పేర్కొన్నారు.  

ఈ సంద‌ర్భంగా త‌ర విష‌యాల‌పై కూడా కేసీఆర్ మాట్లాడారు. బడ్జెట్‌ సమావేశాల ముగిసిన త‌ర్వాత ముస్లింల‌కు ప్ర‌త్యేక రిజర్వేష‌న్లు సాధించే దిశ‌గా రిజర్వేషన్లపై ఢిల్లీలో ధర్నా చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. రాజ్యసభ ఎన్నికల ఏర్పాట్ల బాధ్యతను మంత్రి కేటీ రామారావుకు అప్ప‌గించిన కేసీఆర్ ఆయ‌నకు స‌హ‌క‌రించాల‌ని మంత్రుల‌కు సూచించారు. ఈ బ‌డ్జెట్ స‌మావేశాల్లో గవర్నర్‌ ప్రసంగానికి విపక్షాలు అడ్డుతగిలితే సెషన్‌ మొత్తం సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు. సభకు ఎమ్మెల్యేలు విధిగా హాజరు కావాలని పార్టీ ఎమ్మెల్యేల‌ను ఆదేశించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు