2019లో టీఆర్ఎస్ గెలిచే సీట్లెన్ని?

2019లో టీఆర్ఎస్ గెలిచే సీట్లెన్ని?

మాట‌ల‌తో రోమాలు నిక్క‌బొడుచుకునేలా చేయ‌డంలో రాటుదేలిన కేసీఆర్‌... త‌న‌పై వ‌చ్చే వ్యాఖ్య‌ల‌కు అంతే ఘాటుగా స‌మాధానం ఇస్తుంటారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తాన‌ని ప్ర‌క‌టించాక ... దానిపై కొంద‌రు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌గా, ఇంకొంద‌రు విమ‌ర్శ‌లు చేశారు. కేసీఆర్ కంటే చాలా మంది థ‌ర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్ర‌య‌త్నించి ఫెయిల‌య్యార‌ని, ఇది కూడా హ‌డావుడే అని అన్నారు. దీనిపై ఈరోజు జ‌రిగిన శాస‌న స‌భా ప‌క్ష స‌మావేశంలో కేసీఆర్ స్పందించారు.  

*నేను జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్ల‌డం ఖాయం. దేశ రాజ‌కీయాల్లో గుణాత్మ‌క మార్పు కోసం నా ప్ర‌య‌త్నం చేస్తాను. 2019 వ‌ర‌కే రాష్ట్ర రాజ‌కీయాల్లో ఉంటాను* అని వ్యాఖ్యానించిన కేసీఆర్ నాది థ‌ర్డ్ ఫ్రంట్ కాదు, ఫ‌స్ట్ ఫ్రంట్ అని వ్యాఖ్యానించారు. అయితే, అదే వ్యాఖ్య‌ను నిన్న కేటీఆర్ చేశారు. దానిని తండ్రి అందిపుచ్చుకోవ‌డం విశేషం.  దేశ రాజ‌కీయాల్లో రాజ‌కీయ శూన్యం ఉంద‌ని, ప్ర‌జ‌లు అవ‌కాశం కోసం ఎదురుచూస్తున్నార‌ని, ఆ అవ‌కాశం మ‌నం క‌ల్పిద్దామ‌న్నారు.

రాష్ట్రంలో మ‌ళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి వ‌స్తుంద‌ని ఘంటాప‌థంగా చెప్పిన కేసీఆర్ న‌లుగురైదుగురు మిన‌హా సిట్టింగ్‌లు అంద‌రికీ సీట్లు ఇస్తాన‌ని అన్నారు. 106 సీట్ల‌తో మ‌ళ్లీ టీఆర్ఎస్ దిగ్విజ‌యంగా గెలుస్తుంద‌ని ధీమా వ్య‌క్తంచేశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యేలు బొడిగె శోభ, గంగుల కమలాకర్‌లపై కేసీఆర్‌ అసహనం వ్య‌క్త‌ప‌రిచారు. పద్దతి మార్చుకోవాలని హెచ్చరిస్తూ... ప్ర‌జాద‌ర‌ణ కంటే మించినది ఎన్నిక‌ల్లో గెలుపున‌కు మ‌రేదీ లేద‌న్నారు. అనంత‌రం ఈ బ‌డ్జెట్ స‌మావేశాల్లో అనుస‌రించాల్సిన వ్యూహం గురించి చ‌ర్చించారు.  పార్టీ శాస‌న స‌భా ప‌క్ష సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు కూడా హాజరయ్యారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు