జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లంటూ అంత మోస‌మా?

జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లంటూ అంత మోస‌మా?

యూత్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఉన్న ఫాలోయింగ్ ఎంతో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. దాన్ని ఆస‌రాగా చేసుకొని న‌యా మోసాల‌కు పాల్ప‌డుతున్న దుర్మార్గం ఒక‌టి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప‌వ‌న్ అంటే పిచ్చ‌గా అభిమానించే ప్రాంతాల్లో ఉభ‌య గోదావ‌రి జిల్లాలు ప్ర‌ధానంగా నిలుస్తాయి. మిగిలిన ప్రాంతాల‌తో పోలిస్తే.. ఈప్రాంతంలో అభిమానం పాళ్లు కాస్త ఎక్కువ‌గా ఉంటాయి.

దీన్ని అస‌రాగా చేసుకొని అమాయ‌కుల్ని టార్గెట్ చేసే ఒక బ్యాచ్ రంగంలోకి దిగి. సినిమా అవ‌కాశాలు ఇప్పిస్తామ‌ని చెప్ప‌టం.. ప‌వ‌న్ పేరుతో దొంగ క‌బుర్లు చెప్ప‌టం.. ఫేస్ బుక్.. వాట్సాప్ లాంటి సామాజిక మాధ్య‌మాల్ని ఉప‌యోగించుకొని యువ‌తులతో ప‌రిచ‌యాలు పెంచుకుంటున్నారు. ఆపై వారిని వేధింపుల‌కు గురి చేస్తున్నారు. ఈ త‌ర‌హా దారుణాల‌కు పాల్ప‌డుతున్న ఏడుగురు స‌భ్యులున్న ఒక బ్యాచ్ ను తాజాగా ఏలూరులో అరెస్ట్ చేశారు.

వీరి పాలిట ప‌డ్డ ఒక యువ‌తి ఇచ్చిన ఫిర్యాదుతో వీరి పాపం పండింది. ఏలూరుకు చెందిన ఏడుగురు యువ‌కులు గ‌డిచిన కొంత‌కాలంగా తాము జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌లుగా ప్ర‌చారం చేసుకుంటున్నారు. ఆ పేరుతో యువ‌తుల‌తో ప‌రిచ‌యం పెంచుకుంటున్నారు.

మాయ‌మాట‌ల‌తో ట్రాప్ చేస్తున‌నారు. తమ‌కు సినిమా హీరోల‌తో ప‌రిచ‌యాలు ఉన్నాయ‌ని.. వారిని ప‌రిచ‌యం చేస్తామ‌ని లేనిపోని ఆశ‌ల్ని క‌ల్పిస్తున్నారు. వారితో స్నేహం న‌టించి.. వారి ద‌గ్గ‌ర డ‌బ్బులు దోచేయ‌టంతో పాటు.. వారిని బెదిరింపుల‌కు గురి చేస్తున్నారు. తాజాగా ఒక బంగారు వ్యాపారి కుమార్తెకు ఇలాంటి అనుభ‌వం ఎదురుకావ‌టం.. ఆమె ద‌గ్గ‌ర నుంచి మూడున్న‌ర కేజీల బంగారాన్ని దోచేశారు. తాను మోస‌పోయిన విష‌యాన్ని గుర్తించిన స‌ద‌రు మ‌హిళ‌.. విష‌యాన్ని పోలీసుల దృష్టికి తేవ‌టంతో వారు రంగంలోకి దిగారు. మాయ‌గాళ్ల‌ను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు.

గ‌తంలోనూ వీరు ప‌లు నేరాల‌కు పాల్ప‌డ్డార‌ని.. మాయ మాట‌ల‌తో మోసం చేశార‌ని.. పెద్ద ఎత్తున బంగారాన్ని దోచేసిన‌ట్లుగా గుర్తించారు. తాము తీసుకున్న బంగారాన్ని ముత్తూట్‌.. మ‌ణ‌ప్పురం.. యాక్సిస్ త‌దిత‌ర సంస్థ‌ల్లో తాక‌ట్టు పెట్టి గోవా త‌దిత‌ర ప్రాంతాల‌కు వెళ్లి విలాసాల్లో మునిగి తేలుతున్న‌ట్లుగా గుర్తించారు. సో.. ఇలంటి దొంగ జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల విష‌యంలో కాస్త జాగ్ర‌త్త‌గా ఉండండి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English