వాళ్లు తప్పు చేస్తున్నారన్న శ్రీకాంత్

వాళ్లు తప్పు చేస్తున్నారన్న శ్రీకాంత్

సినిమా తారలపై గాసిప్పులు అనే పాయింట్ పాతదే. వద్దు వద్దు అన్నా ఇవి పుడుతూనే ఉంటాయి. కానీ ఇంతకాలం ఈ రూమర్లు ఒక దారిలో ఉంటే.. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ పుణ్యమా అని మరీ దారుణంగా తయారైపోయాయి. లైక్స్.. వ్యూస్ కోసం మనుషుల ప్రాణాలు కూడా తీసేస్తున్నారు. సెలబ్రిటీల పరువు తీయడంతో పాటు.. వారి ప్రాణాల మీదకు తీసుకొచ్చేస్తున్నారు.

ఆ హీరోయిన్ ఈ హీరోతో హోటల్ లో ఏం చేసిందో తెలుసా.. లాంటి టైటిల్స్ పెట్టి పరువు తీయడంతో పాటు.. ఫలానా స్టార్ కి యాక్సిడెంట్.. చావుబతుకుల మధ్య ఉన్నాడంటూ ప్రచారం చేస్తున్నారు. కొందరిని అయితే చచ్చిపోయారని కూడా ప్రచారం చేసిపారేశారు. ఇప్పుడు హీరో శ్రీకాంత్ కూడా బాధితుడు అయిపోయాడు. ప్రస్తుతం బెంగళూరులో ఓ సినిమా షూటింగులో ఉన్నాడు శ్రీకాంత్. కానీ ఓ యూట్యూబ్ ఛానల్ లో ఈ సీనియర్ హీరోకి యాక్సిడెంట్ అయిందంటూ ప్రచారం జరిగింది.

దీన్ని చూసి మిగిలిన వాళ్లు కూడా ఇదే ప్రచారం చేసేశారు. ఈ దెబ్బకి శ్రీకాంత్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కంగారు పడిపోయారు. ఈ ఉదంతం మొత్తాన్ని ఖండించిన శ్రీకాంత్.. మనుషుల ఫీలింగ్స్ తో ఆడుకోవడం తప్పని అన్నాడు. నిజానిజాలు తెలుసుకోకుండా ఇతరులు గుడ్డిగా ఫాలో అవడం ఇంకా పెద్ద తప్పు అంటున్నాడు శ్రీకాంత్. ఇప్పుడు ఆ యూట్యూబ్ ఛానల్ పై మా కార్యాలయం ద్వారా పోలీసులకు ఫిర్యాదు కూడా అందింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు